పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీః

ఐదవ యపన్యాసము

వేమన యోగసిద్ధి-మత ప్రచారము

వేమనకు లంబికాశివయోగివలన యోగమార్గోపదేశము లభించెనని చెప్పితిని. ఆ యోగ సాహాయ్యముచే వేమన యేమి సాధించెనని యూహించుటకు ముందు యోగ సామాన్యస్వరూపమును గొంతవఱకు నెఱుఁగవలసి యున్నది. సాధకు నకుఁ దప్ప తక్కినవారికి దీనినిగురించి చర్చించు నధికారమే లేదు గావుస నీ విషయమును దడవుటకే భయపడుచున్నాను." కాని విధిలేదు. బహిరంగమైస బుద్ధితో ఎంత నాకు గ్రహించుటకు సాధ్యమో యంత మనవి చేయుచున్నాను

సకల జగత్కారణమైన మూలవస్తువొకటి కలదని మన ప్రాచీనులు వేలకొలఁది యేండ్ల క్రిందనే గ్రహించిరి. దాని తత్త్వము నెఱి(గిస పక్షమున, నృష్టియందలి సందేహములకెల్ల నందు ప్రత్యుత్తరములు లభించుననియు, బంధములన్నియు నుడుగుననియుఁ దల(చిరి

               “భిద్యతే హృదయగ్రస్ట్ శ్చిద్యనే సర్వసంశయా?
                 క్షీయన్తే సర్వకర్మాణి తస్మిస్ దృష్టి పరావరే "*[1]

అది సగుణమయినను నిర్గుణమైసను సూన్యమైనసు దాని స్వరూపము ననుభవ పూర్వకముగ నెఱుఁగక తీఱదని తేలినది. కాని చాని నెఱుఁగుట యెట్లు ? మితమైన గల కన్ను ముక్కు మొదలగు బహిరింద్రియములచే సాధ్యముగాదు. సాధ్య మైనచో అమితమైన ప్రభావముగల మనస్సును అంతరింద్రియముచేతనే కావలయును. యీ మనస్సు చంచలమైనది. నిమేష కాలమైనను ఒకవిషయమును ధ్యానించు స్థ్యములేనిది. డానికితోడు శరీరమందును సంసారమందును గలుగు వివిధావస్థలు నిని ఒకచోట నిలుపనీయవు. కావున మనస్సు ఈ దేహమునకును బహిస్సంసారము కును లోబడక తనంతట అఖండముగా నిలిచి కార్యమును నిర్వహించు మార్గ మొకటి వెదకవలిసివచ్చెను. ఆదేయోగము

               యదా ప్రజ్ఞావరిష్టన్తే జ్ఞానాని మససాసహ
               బుద్ధిశ్చన విచేష్టతి తామాహుః పరమాంగతిమ్
               తాంయోగమితి మన్యన్తే స్థిరామిన్షియాధారణామ్"
                                                                                 —కఠోపనిషత్తు 210

(ఎప్పడు పంచేంద్రియములు మనసుతోఁజేరి నిలుచునో, బుద్ధియల్లాడదో, అదియే పరమగతి ; అట్టి యింద్రియథారణమే యోగమందురు.)

బ్రహ్మధ్యాన మావశ్యకమనియు, దానికి మనోనిగ్రహము దేహదండనమును

  1. * ఆ పరావరమూర్తిని జూచే వెంటపడే హృదయపు ముడి వదలును ; అన్ని సందేహములు దీరును. అన్నికర్మములును క్షయించును. ముండకోపనిషత్తు, 2-2-8