పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ఉపన్యాసము


ఉపోద్ఘాతము


వేమన ఆంధ్రులలో సాటిలేని వ్యక్తి. అతీందియములైస తత్త్వములను దెలిసికొనవలెనను నాశ, వాని ననుభవ పూర్వకముగా సాధించు సాహనము, తనకుఁ దెలిసిస వానిని నిర్భయముగా ప్రపంచమునకు భోధించు దైర్యము, దానికి సాధనమై యిరుప్రక్కలందును మఱుఁగులేని మంచిపదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెఱుఁగిచ్చునట్టి సంకేత దూషితము కాని ప్రపంచ వ్యవహారము లందలి సూక్ష్మదృష్టి, గాయపుమందు కత్తికేపూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు 'హాస్య కుశలత - ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవఁడుపయోగించిన మూలద్రవ్యములు. తత్వ విద్యార్థులున్నారు కాని వారిదంతయు పుస్తక పాఠము. వారి శక్తి యంతయు ఇతరులు చెప్పిన దానిని పల్లించుటలో ముగిసిసది. యోగమును సాధించు వీరులున్నారు గాని వారిలో ననేకులకు మాటలాడుటయే రాదు ; వచ్చినను ఇతరులకు బోధించుటకు కాలము కర్చుపెట్టుట నష్టమని భావించువారే యనేకులు ; తక్కిన వారు చాలవఱకు తాము సత్యమని నమ్మినవానిని గూడ ఇతరుల మనసు నొచ్చనేమోయని చెప్పక తప్పించుకొని తిరుగునట్టి 'ధన్యులు". కవులు మసలో దండిగ-కావలసినంతకన్న ఎక్కువగానే-యున్నారు. కాని వారిది మసన ప్రపంచము గాదు. గంధర్వనగరము. ఇక తిట్టుకవిత్వము తెలుగు వారు పెట్టిన భిక్షయే ; కవిత్వమును తిట్లకై యుపయోగించుట తెనుగు జాతిలోని విశేష గుణము! కాని యా తిట్లలో స్వామున్నంత పరార్థము లేదు. 'నాకియ్య లేదని తిట్టినవారే కాని 'నీవు చెడిపోవుచున్నా' పని తిట్టిన వారరుదు. ఇఁక హాస్యమా ? అది మన తాతలగు సంస్కృతము వారికే రాదు, మన నెట్లు వచ్చును? నవ్వించు వారున్నారు; అసహ్యముతో నవ్వదుము; వెక్కిరింతలకు నవ్వదుము : అంతే కాని నయముతోడి నవ్వు మనకింకను ఎవరైన నేర్పవలసి యున్నది. పై గుణము లన్నియు ఒకచో నేకీభవించినమూర్తి వేమన తప్ప తెలుఁగు వారిలో ఇతరుఁడు నాకంటఁబడలేదు.

ఆంధ్రులలో కొన్ని విచిత్రములు గలవు. వానికి తృప్తికరముగా నిదివఱ కెవరును సమాధాన మిచ్చి యుండలేదు. భరతఖండముస ప్రసిద్ధములగు నన్ని భాషలలోను ప్రవేశించి అసంఖ్య గ్రందములను వ్రాసిన జైనులు మన భాషలో గ్రంథములు రచించినట్లే కానరాకపోవట యొకటి. ఆంధ్రభాష ద్రావిడ శాఖనుండి చాలా నాళ్ళక్రిందనే చీలి వేఱుపడినదని స్పష్టముగా సూహింప వీలున్నను, పదునొకండవ శతాబ్దికి వెనుక సారస్వత వ్యాపారమే యందులో జరిగినట్లు తెలియక పోవుట వేరొకటి, సంస్కృత వాజ్మయములో చక్కని నాటక రచన రెండువేల యేండ్లకు ముందునుండి జరిగివచ్చుచున్నను, ఆ వాజ్మయమునే ఆధారముగాఁ