పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన వంటివారు 107

                     రాగం : మధ్యమావతి - ఆదితాళం

               “సంసారైనా వకటి-సంసారము విడిచిన నొకటి. (పల్లవి)
                హంసనటించే విధమెటి(గుంటే సంశయములు తనమది విడిచుంటే, సం||

               "ఇలవార్తలు వినకుంటే - తన - యింద్రియములు వశమంటే
                కలలో మరవక యుంటే మరి కల్లలన్ని తొలగుంటే, సం!!

               "నిలుకడ శాంతంబుంటే - తస - నిబసమాధిగలిగుంటే
                పలుమరుయోగుల భాషలు వినుచును, చలము మంచి తానిలుకడయుంటే...
                                                                (వీరబ్రహ్మముగారి నాటకము, పే. 61)

ఇది కాక వీరాచారి చరిత్రమందు క్రింది పదపుతునక యొకటి యుదాహరింపఁబడినది :

                 “చిల్లరరాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర వొరేవొరే !
                  చిత్తమునందలి చిన్మయజోతిని చూచుచునుండుట సరేసరే
                  వొక్క ప్రాద్దులని యొండుకనుంటే వానరగ చెడుదువు వొరే వెరే"
                                                                (వీరాచార్య చరిత్రము, పే. 8)

పై పద్యములు చూడఁగా, వేమన కవిత్వము నందున్నంత వేగముగాని ఆ యచ్చుకట్టుగాని యిందులో లేదని తెల్లమగును. కాని సామాన్యజనుల కింత మాత్రము చాలును. దీనికితోడు వ్రాసినవాఁడు విరక్తుఁడై హఠయోగసిద్ధుల వింతలఁ జూపిన మహానీయుఁడగుట, అతనిపదము లనేకులు పాడుచుండుటకును, అతని ననేకులు పూజించుచు ఉత్సవాదుల నిప్పటికిని జరుప చుండుటకును కారణమయినది. కటార్లపల్లె తుంగవేమన్న యిట్టివాఁడే కదా? వీరబ్రహ్మము సమాధియును స్థాపించిన మఠమును "కందిమల్లయపాళెము లోఁగలదట, ఇతఁ డును సజీవముగా "సమాధి'లోc ప్రవేశించిన వాcడే. ఈతని పౌత్రియగు నీశ్వరమ్మ యను నామెయు బ్రహ్మచారిణి యగు యోగినిగా నుండి ప్రసిద్ధిగాంచెనఁట. ఈశ్వరమ్మగారి మఠము నాయూరనే కలఁదట. ఇతని శిష్యుఁడు దూదేకుల సిద్దయ్యయు ఇట్టివే కొన్ని పాటలు వ్రాసెను. ఈతని విషయమగు స్తోత్రములు సంస్కృతభాషలో గలవు.*[1]

ఏగంటివారు

ఇట్లే అద్వైతమును బోధించుపాటలు 'ఏగంటివారి వచనాలు' అను పేరు గలవి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథ మందిరమునఁ గలవు.†[2]

ఏగంటివారెవరో ఒకరో అనేకులో యే యూరివారో యొప్పటివారో తెలియు నవకాశము నాకు లభింపలేదు. కొన్ని గుజిలీ ప్రతులలో నీ పాటలు కొన్ని 'యేగంటి లక్ష్మయ్యగారి వచనాలు' అని ముద్రింపఁబడినవి. ఆంధ్రదేశమునందు వీని కెక్కువ వ్యాప్తికలదని వినుచున్నాను. జనులలో నెక్కువ వ్యాప్తిని గాంచుటకును మననము చేయుటకును పద్యములకన్న పాటలెక్కువ పనికి వచ్చునను తత్త్వమును పండితు లనేకులు గమనింపలేదు గాని, పామరులు మాత్ర మెఱి(గి యాచరణకుఁ దెచ్చిరి. అట్టి పాటలలో సామాన్యముగాఁ గానరాని భాషా సౌష్టవము, విషయమును సంగ్ర

  1. * చూ, వీరబ్రహ్మ నాటకము, పే. 87.
  2. † tశ్రీ వే, ప్రభాకరశాస్త్రిగారు నాకివి చూపిరి,