పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము 5

పంతులుగారివంటి "నవ్యభావ ధురంధరులకును" వీరు కవులని తోcపలేదు. వేమనగూడ నీగతిని దప్పించు కొస్నవాఁడు గాఁడు. మకియొక వింత యేమనఁగా, మన వారితనిని కవిగాఁ దలఁపక పోయినను, ఇతని పద్యముల నన్నిటిని బహు శ్రమచే సంపాదించి, తిద్ధించి, వ్రాయించి, తానే ఇంగ్లీషున టీక వ్రాసి, ప్రకటించి, శాశ్వతకీర్తి సంపాదించిన బ్రౌను దొరకూడ ఇతనిని కవి యనలేఁడయ్యెను. *[1]వేమన యందుఁగల యసాధారణ కవితా ధర్మములను గూర్చి వేఱుగా చర్చింతును. నిఘంటు పండితులును వ్యాకరణ పండితులును ఏమనుకొన్నను, ఇతని కాంధ్ర దేశ మందుఁగల మర్యాదకు, ఇతనిబోధ లింకను చెడక తెలుఁగు వారి హృదయ ముల నాఁటుకొని యుండుటకును, ఇతని పలుకులయందుఁ గల కవితానైశిత్యమే ముఖ్యకారణమనుట నిస్సందేహము. కావున మతాభిమానము, కవిత్వమందభిరుచి గలవారందఱును వేమన వాక్యములను చూడకపోయిన నష్టపడినవారగుదురు, అతని సిద్ధాంతముల నమ్మి యంగీకరించుట వేఱు మాట.

కాని వేమన పద్యములను జదివి యందుమూలమున నతని వివిధసిద్ధాంతములను నిర్ణయించుటకుఁ బూనుకొంటిమేని మనకు కొన్ని కష్టములున్నవి. వానిలో మొదటిది అతని పద్యములేవి, కానివేవి, యని నిర్ణయించుట. ఇతరులు వ్రాసిన గ్రంథములలో మన మాటలు దూర్చుట మనలో అనాదియైన యాచారము. వేదములు, ఉపనిషత్తులు గూడ నీయవస్థకు లోబడినవే ; కావుననే యందందు వేదవాక్యముల సంఖ్యను నిర్ణయించు వాక్యములు వానిలో చేర్పఁబడినవి. ఇక పురాణములగతి యడుగ(బనిలేదు. కాళిదాసాది కవుల కావ్యములుగూడ నీయవస్థకుఁ దప్పలేదు అట్లుండ వేమనను మాత్రము మనవారు మన్నించుటకుఁ గారణములేదు. మఱియు వేమన యొక గ్రంథముగా వ్రాసినవాఁడు కాడని మొదలే చెప్పితిని. 'వ్రాలకందని పద్యముల్ వేలసంఖ్య †[2](2264) గా జెప్పిన వాఁడు.

             "క. భువి రాజ తారకంబులు
                  ప్రవిమలతర హంన యోగ భావంబులకున్
                  వివరంబులు గావించెద." (1853)

ఆనుపద్యమొకటి యితఁడొకగ్రంథము వ్రాయనారంభించినట్లు సూచించుచున్నది ; అందందు కొన్ని పద్యములు, ముఖ్యముగా కందములు, ప్రాయికముగ కేవల యోగ రహస్యాదివిషయములను దెలుపునవియై, వేమనకుగల సహజమగు వేఁడి లేక, నిదానముగా కూర్చుండి వ్రాసిన గ్రంథములోని వేమో యనిపించును. కాని ఆ గ్రంథము నతఁడు పూర్తిగా ముగించినాఁడను నమ్మిక నాకు లేదు.

  1. * The Verses of Vemana' వావిళ్ళవారి ముద్రణము, పీఠిక, మూడవ పేజీ చూడుము.
  2. †ఈ సంఖ్య బందరులో ప్రకటింపఁబడిన వేమన సూ_క్తిరత్నాకర మను గ్రంథమందలి పద్యసంఖ్యను దెలుపును. వేయివేటు వ్రతులలో నుండి యుదాహరించు నపుడు వానిని ప్రత్యేకముగఁ బేర్కొందును, కాని వట్టిసంఖ్య యెందున్నను అది యీ కూర్పునకే యన్వయించునని తెలియునది,