పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన. 98

అని చెప్పినను, దానపాత్రవిషయమున అతనికున్నంత విశాలదృష్టి యితని కున్నట్లు తో(పదు. ఇతనిమతమున అందఱికిచ్చుటకన్న శివభక్తులకిచ్చు దానమే శ్రేష్టము (551-553) కాని గతిలేని చేతఁగానివారేమి దానము చేయఁగలరు ? ఇతని యుత్తరము, జంగాలు తెచ్చిన బియ్యము వండి పెట్టుట, ఉండుటకు తావిచ్చుట, తాగుటకు నీరిచ్చుట ? (554) ఇది గూడ చేయలేని పేదవారుండరు గదా!

ఇట్లతనికి వేమన్నకన్న శివపక్షపాతమును, ఇతరదేవతలయం దనాదరమును కొంచెమెక్కువగా నుండెను. 'నరసింహుని యవతారము పెద్ద విచిత్రమే కాని శరభుఁడు గోటితోఁ జంపునపుడు విష్ణువూరినక్కవలె నాయెను' (175). కావున పదిజన్మములెత్తి ఎద్దుగేదెలను గాచి, పాండవుల సేవకుఁడైన హరి యేటిదేవుఁడు ? అని యితఁడు ప్రశ్నించుచున్నాఁడు (174). కాని యోగసాధనకుఁబూని చేయఁగా అందుఁగలుగు చిత్రవిచిత్రములగు ననుభవములు గమనించి, బ్రహ్మసాక్షాత్కార సౌఖ్యమనుభవించుటకు మొదలిడిసవెంటనే యితనికి బహిరంగములగు భావ లన్నియు వేమనకువలెనే నశించినవి. ఈ విగ్రహపూజలు, ఈ వేదవాదములు, ఈ జాతిబేదములు మొదలగునవన్నియు తత్త్వనిర్ణయముననెందుకును తరముగావని తలఁచెను. 'చెడురాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!? (2372) యని చెప్పిన యతనివలెనే యితనికిని, దేవళమందలి శివలింగము సంబారము నూఱుటకు పనికివచ్చుగుండేకాని వేఱుకాదని తోఁచినది. “సంబారవరేవ బలుకల్లు హరనెందు నంబువవరారు నర్వజ్ఞ’ (165). ఎన్ని వేదములున్న నేమిఫలము ? " అనుభవియ వేద వే వేద? (816)-అనుభవించిన వాని వేదమే వేదము. మఱియు 'నాల్గు వేదములును నాల్గుచన్నులు; నాదమేనురుగు పాలు, దీనిని సాధించుశక్తి శివయోగికి తప్ప తక్కినవారికి లేదు? (424). వేమనయు “వేదసార మెల్లవేమన యెఱుఁగును" (3607) అని చెప్పెను. యోగులెల్ల నిట్లే చెప్పకొందురు.

            "మథిత్వా “చతురోవేదాన్ సర్వశాస్త్రాణి చైవహి
             సారస్తు యోగిభిః పీతస్తక్రం పిబతి పట్టితః "
                                               (జ్ఞానసంకలినీ తంత్రము, 50)

(అన్ని వేదములును శాస్త్రములును మధించి యోగులు సారము త్రాగుదురు. పండితుఁడు వట్టి మట్టిగ త్రాగును.)

కా(బట్టి జ్ఞానికి వాదముతోఁబనిలేదు. మఱియు బ్రహ్మజ్ఞానము గలవాడూరకుండవలయునే కాని దానినిగూర్చి చర్చించుట, దొంగిలింపఁ బోయినవాఁడు తుమ్మినట్లగును (324). వేమనయు “లోచూపచూడ నొల్లక వాచాబ్రహ్మంబు పలుకవలదుర వేమా? యని చెప్పెను (3340). యజ్ఞయాగాదులందతని కెంత ద్వేషమో యితనికి నంతే. ఒక మేకను జంపి తిన్నవాఁడు స్వర్గమును జేరఁగల్లునేని. యెప్పడును మేకలను లెక్కలేక చంపి తిను కటికవాఁడు దేవేంద్రుఁడే గావలదా ? యని యితని ప్రశ్న (847). ఇఁక వేమనవలెనే జాతిభేదములనుగూర్చి దండెత్తిన బనవన్నమతమునఁ బెరిగిన యితనికిని పరబ్రహ్మానుభవము తోడై, యితనిని వానికి పరమశత్రువుగాఁ జేసినది. ఆందఱి కన్న నెక్కువయనఁబడు బ్రాహ్మణులయెడ ద్వేషమును, తక్కువ యనఁబడిన చండాలులందు కనికరమును గలిగినది. బ్రాహ్మణులు ధర్మచ్యుతులైరనియే యితనికిని వేమన్నవలె వారిపై కోపము. యోగ ధ్యానముల నెఱుగక బ్రాహ్మణులు భోగులైపోయిరని వగచెను (825). “తల్లి శూద్రురాలు తానెట్లు బా(పఁడు ? (1476) అని యడిగిన వేమన్న వలెనే,