పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రిక శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వమున రాజమహేంద్రవరము నుండి వెలువడుచుండెను.

ఇక్కాలమున శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారికిని శ్రీ కొక్కొండ వేంకటరత్మము పంతులవారికిని బిల్వేశ్వరీయమను గ్రంథము విషయమై వివాద మేర్పడినది దీనింగూర్చి శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారే ప్రకటించిన వ్యాసమునుండి కొంత యుదాహరించుట మంచిది:-

  • "శ్రీ బిల్వేశ్వరీయకృతి విమర్శనముంగుఱించి- ఈసంవత్సరము మార్చినెల మొదలుగ మేము విమర్శించుచున్న శ్రీ బిల్వేశ్వరీయముంగూర్చి వివిథాభిప్రాయము లితరులచే బ్రకటింపబడినవి. వానికిం బ్రత్యుత్తరముగ నియ్యుపన్యాసముం బ్రకటించుచున్నారము:-

బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ శ్రీమత్కొక్కొండ వేంకటరత్నము పంతులవారు సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముగల వారనుట జగద్విదితమైన యంశము. అట్టి పండితునిచే విరచింపబడిన గ్రంథమును విమర్శించుట పండితులకు విధియైయున్నది. శ్రీ పంతులవారే తమ గ్రంథమును విమర్శనార్థమై 18-9-93 న, మా కార్యస్థానమునకు బంపియున్నారు. గ్రంథమును సాంతముగ జదువగా గుణములతో బాటు గొన్నిదోషము లగపడి నందున మావిమర్శనయంతయు ఒకగ్రంథముగ వ్రాసి ప్రక

_____________________________________________________

  • అముద్రిత గ్రంథచింతామణి సం. 7 సంచి. 12.