పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశిలేఖ: ఈనాటకము నూతనఫక్కిని వ్రాయబడియుండుట చేతను, ఆంధ్రభాషయం దింతకుపూర్వ మిట్టినాటకములు లేకుండుటచేతను, పండితశిఖామణిచే వ్రాయబడిన యీ నాటకరత్నము.....

"ఈనాటకము ఇతర నాటకములవలెగాక నూతన పద్ధతిని వ్రాయబడి యుండుట చేతను........

"ఇన్ని నాటకములు మనభాషయందీ కొద్దికాలములో వ్రాయబడినను సంస్కృతమునుండి ఆంధ్రీకరింపబడిన నాలుగైదు నాటకములు తప్ప మనభాషకు గౌరవము కలుగజేయునవి లేవని మాయభిప్రాయము. అట్లగుటచే భాషాంతరీకరణము గాక స్వతంత్రముగ రచింపబడిన ప్రతాపరుద్రీయ నాటకము ఈలోపమును వారించు ప్రయత్నమునకు గణపతిపూజ యనందగియున్నది. వేంకటరాయశాస్త్రుల వారిచే జూపబడిన నూతనమార్గము పండితులచే నంగీకరింపబడునుగాక యని నమ్ముచున్నాము......

"ఈనాటకము ప్రదర్శింపబడినచో చూచువారు మిక్కిలి యానందమును చెందెద రనుటకు సందియములేదు. గ్రంథకర్త యొక్క లోకానుభవము అద్భుతముగనున్నది. ఆంధ్రదేశముల యందలి తురకలయు, చాకలివాండ్రయొక్కయు, అలవాటులను జక్కగ నెఱిగినవా రీనాటకమం దాపాత్రముల నిసర్గ మనోహరత్వమును గ్రహించి యద్భుతమొందక మానరు"