పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

గాయకుని కిచ్చిరి. గాయకుడు సంతోషించి స్వారస్యపుదారము తెగినరహస్యమును తెలిసికొనలేకయే వెడలిపోయెను. ఈకథ లంబుతాలద్వారా కాలక్రమమున బైటబడెను."

ఆనందబాష్పములుకూడ ఇచ్చటనే యున్నవి. "మఱి యొకరాజు గానరసజ్ఞు డనిపించుకొనుటకై పాట వినునప్పుడెల్ల మిరియాల కలికము కన్నులలోవేసికొని బాష్పములు తెప్పించు కొనెనట, ఆసంగతి వారి కొట్టడిలెక్కలలో 'ఆనందబాష్పములకు అరపలము మిరియాలు' అని వ్రాయబడియుండెనట. ఆలెక్కలవలన ఆయనయొక్క రసజ్ఞత బయలువడెనట."

శాస్త్రులవారికడ నిరంతరము పండితు లెవరో యొకరు వచ్చివిద్యావ్యాసంగము చేయుచుండువారు. శాస్త్రులవారును, స్వయము గాయకులు కారేగాని, ఆశాస్త్రమును చక్కగా నెఱిగినవారు. ఒకదినము శాస్త్రులవారు ఏదో మంచివిషయమునుగుఱించి మాటలాడుచుండగా నొక సంగీతాభిమాని మధ్యలో సంగీత ప్రస్తావముం దెచ్చెను. ఒకానొక బోగముది నాటిసాయంకాలము నాట్యముచేయునని అతడు వచించెను. శాస్త్రులవారికి ఆప్రస్తావము దుస్సహముగానుండెను; పైగా వా రేదో వేఱువిషయమున లగ్నమైయుండిరి; వినిపించుకొనలేదు.

ఆతడు మరల, 'శాస్త్రులవారూ, అది కన్ను తిప్పితేనే చాలునండీ' అని చెప్పెను. ఆతనికి శాస్త్రులవారితో పరిచయము క్రొత్త. శాస్త్రులవారు వెంటనే ఆయనం గని తమ మనోభిప్రాయ