పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు తమ స్వానుభవమున వచ్చిన విశేషవిషయముల భాగములే యని ముందే వ్రాసియుంటినిగదా. స్వారస్యపు త్రాడు ఎచటనైనను దొరకునా యని వెదకుచుండగా జనవినోదినిలో వారి వ్యాసమందే కనబడినది. లాగిచూతము దీనిమొదలు. "గానరసజ్ఞు లనిపించుకొనగోరిన వారియందును అనేక దురభ్యాసములుకలవు. గానరసము బొత్తుగా నెఱుగని యొకరాజు నొద్దికి గొప్పగాయకుడొకడు పాడరాగా, గానమందు మహాపండితురాలైన రాణిగారు, రాజుగారిని ఒక కిటికీయొద్ద కూర్చుండబెట్టి వారిజుట్టునకు ఒకదారముగట్టి తాను కిటికీయొద్ద గోడచాటున (ఈకాలపు పంకావానివలె) కూర్చుండి గాయకుని పాటలో విశేషించి స్వారస్యము అగుపడినప్పుడెల్ల దారమును లాగుచుండెను. వెంటనే రాజుగారి తల యూగుచుండెను. గాయకుడు రాజుగారి రసజ్ఞతకు ఆశ్చర్యపడి ఆనందించి మఱియమఱియు హెచ్చరికతో ఇంక స్వారస్యముగా పాడసాగెను స్వారస్యపు దారముమూలముగా రాజుగారి తల మఱి మఱి ఆడసాగెను. ఎక్కువయూపుచేత ఆదారము పుటుక్కున తెగెను. అంత నారాజు గాయకునితో "ఓహోయి పాట నిలుపు, స్వారస్యపుదారము తెగిపోయినది" అనెను. గాయకుడు దాని యర్థమును గ్రహింపనేరక పాటమాత్రము మాని బ్రాంతుడై నలుదెసలు చూడసాగెను. ఈలోపున రాణిగారు ఒకపళ్లెములో బహుమానమును పంపిరి. దానిని రాజుగారు