పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమర్థి రంగయసెట్టిగారు నన్ను మదరాసు క్రిస్టియన్కాలేజి సంస్కృత ప్రథానపండితుం గావింపం దలంపుగొనిరి. నేనును ఆ పదమునే కోరుచుంటిని.

"ఆసమయమందే డాక్టరు ఆపర్టుదొరగారికి నేను ఇంచుకంత ఉపకరించితిని. ఎట్లన-వారు అప్పటికి ఐదుఏండ్లకుముందు 'నరపతివిజయము'ను ముద్రింపం దొరంకొని ప్రాయికముగా పండిత పరిష్కృతము సేయించియు, అందొక చూర్ణిక బిరుదాం కాది భూయిష్ఠము ఆదిలో కవిపెట్టిన రూపుం గోల్పోయి లేఖ కాది కారణంబున శబ్దస్వరూప వాక్యావాంతర వాక్యాది విభజన లేర్పడక క్రంపబలిసియుండ దానిని సంస్కరింపుడని మదరాసులోని సుప్రసిద్ధాంధ్రపండితులు మువ్వురుకడ నైదేండ్లు ఉంచియు భగ్నమనోరథులైరి. వారిని నేను కార్యవశంబున దర్శింపగా వారు ఆచూర్ణికను తదీయ దురూహతా వృత్తాంతముంజెప్పక నాచేతికిచ్చి సవరింపుమనిరి. నేనును వారము దినములు ఉన్మత్తునివలె తదేకతానుడనై దానిని సవరించి సాధువుగావ్రాసి ఆంగ్లానువాద సమేతముంగావించి కొనిపోయి వారికిచ్చితిని. వారు నాయిచ్చినదానిం గైకొని పండితసమేతముగా రెండు వారములు పరిశోధించుకొని అంగీకరించి అనంతరము నాకు దాని యా యైదేండ్లవృత్తాంతమును వక్కాణించిరి.

"ఆ యిరువురచేతనుం బ్రతిబోధితులై డాక్టరు మిల్లరుగారు పూర్వోక్తమైన మదరాసు క్రిస్టియన్కాలేజి సంస్కృతోపాథ్యాయపదమును 1886 సం. నవంబరులో నాకొసంగిరి."