పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పి ఉపన్యాసం ముగియగానే, సభలేచినసందులో, తప్పించుకొనే ఉద్దేశం నాకులేదు. ఎక్కడికక్కడనే సందేహాలు తీర్చవలసింది న్యాయం. నాకు చేతనైతే సమాధానాలుచెప్తాను. చేత కాకపోతే పోయి కూర్చుంటాను. చెప్పగలిగినవాడు వచ్చి చెప్తాడు' అని.

ఏలయనగా వారి ప్రతిపక్షులు, ఉపన్యాసములు ముగిసినవెనుక సందేహములకు సమాథానములు చెప్పెద మని, తొలుత చెప్పి ఉపన్యాసము ముగిసినవెంటనే సభలేచు కలకలములో సమాధానములు చెప్పకయే తప్పించుకొని పోవుచుండిరి. అట్టివారికి దెబ్బగా శాస్త్రులవారు ఈవాక్యములను పలికిరి.

'అయ్యయ్యో! శాస్త్రులవారూ, అట్లాగయితే కొంపమునుగుతుందే' అని వీరిపక్షమువారొకరు వెనుకనుండి హెచ్చరించిరి.

'ఎంతమాత్రము కాదు. అదినాశపథము' అని శాస్త్రులవారు బదులు పలికిరి.

'అయ్యా! ఆయనదోవలో ఆయన్ను పోనీయండి. అంతా చెయ్యగలిగినవాడే.' అని యితరులు చెప్పిరి.

శాస్త్రులవారి యుపన్యాసమునకు అంతరాయము కలుగ లేదు, అందఱును ఆశ్చర్యముతో వినుచుండిరి. కొందఱు ప్రతి పక్షులు దీనిని చూడలేక ఎట్లైనను ఒకప్రశ్నవేసి అంతరాయము కలిగించవలయునని తమలో కలియబలికికొని ఒకనిని