పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము


'తొందరలేదు నెమ్మదిగానే తెచ్చిపెట్టు' అని సీతారామశాస్త్రులవారు దాని నిచ్చినారు. వెంటనే శాస్త్రులవారు ఆపెద్ద గ్రంథమును ఇంటికి తెచ్చుకొని రాత్రియంతయు నిదురపోక చదివి అందులోని భాగముల నెన్నిటినో వ్రాసికొని ఉదయము దంతథావనమునకు ముందే దానిని గురువుగారికడకు కొని పోయిరి.

'అర్థంకాలేదాయేమి?' అని వారడిగిరి.

'ఇది చిత్తగించినారా' యని వేంకటరాయశాస్త్రులవారు తమవ్రాతను చూపిరి. వారు ఆశ్చర్యపడి కొన్ని నెలలుగా నది తమకడ నూరకపడియుండిన యాచరిత్రమును చెప్పి, వెంటనే ఆపుస్తకమును ముత్తుస్వామయ్యరుగారికి పంపివేసిరి. అందరకు కావలసినపనియు వేంకటరాయశాస్త్రులవారు చేసివేసినారు. ఈ విధముగా శాస్త్రులవారు విషయసంకలనము చేయుచుండిరి.

ఒకదినము శాస్త్రులవారు ఉపన్యాసము చేయుచుండిరి. సభ క్రిక్కిరిసియుండెను. పండితులు, ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయాధిపతులు, విద్యావంతులు నింక నెందఱో వచ్చియుండిరి. శాస్త్రులవారు ఉపన్యాస మారంభించి ముందుగానే యిట్లు ప్రతిజ్ఞచేసిరి.

'ఎవరికైనా సందేహాలు కలిగినపక్షంలో వెంటనే, అప్పుడే, ఉపన్యాసము మధ్యలోలేచి నన్ను అడిగివేయవలెను. ప్రకరణము దాటిపోగానే మీరు మరిచిపోవచ్చును. లేదా నేను మరిచిపోవచ్చును. ఉపన్యాసంకాగానే సందేహాలు తీరుస్తామని