పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము


శాస్త్రులవారికి ఈకాలములో సోదరవియోగము వాటిల్లినది. వెంకటసుబ్బయ్యగారు శాస్త్రులవారితో ఆబాల్యము క్రీడించినవారు, నిరంతరము తోడునీడగా నుండినవారు, ఆకస్మికముగా నాలుగుదినములు జ్వరముచే బాధపడి రాజమండ్రిలో మరణించిరి. వారి గుణాదికములను శాస్త్రులవారు అప్పుడప్పుడు చెప్పి దు:ఖించు వారు. అన్నగారికన్నను ముందే ఎఫ్.ఏ., ఐ అన్నగారు ఇంకను బి.ఏ., కాలేదను కారణమున, తాము, అనాయాసమున బి.ఏ., కాగలిగినవారే అయ్యును 'అన్న బి ఏ., కాకముందే నేను బి.ఏ., అయితే బాగుంటుందా?' అని మానుకొనిరట. వీరికి ఆంగ్లభాషయందు అప్పటికే మంచి ప్రావీణ్య మేర్పడినది. సంగీతమునందును చాల అభిరుచి యుండెడిది. ఒకప్పుడు ఫిడిలునేర్చిన యొకడు వారికడకువచ్చి తనకు ఏదైన సాయముచేయవలసినదని కోరగా వెంటనే వీరు ఆలోచించక అన్నగారిద్రవ్యమునుండి ఆతనికొక రూపాయయిచ్చి, ఆ వెనుక అన్నవచ్చి ఏమిచెప్పునోయని భయపడుచుండిరట. అన్నగారు ఈవిషయమును తెలిసికొని తమ్మునిజూచి 'నీవు చేసినది మంచిపని' అని చెప్పువరకు వారిభయము తీరలేదు. సకలవిషయములయందును అన్న గారిమాట వేదవాక్యము. 'పాండిత్య ప్రతిభలలో సర్వవిధములను నన్ను మించినవాడు నాతమ్ముడు' అని శాస్త్రులవారు పలుమార్లు వచించువారు. ఆసోదరుల సౌభ్రాత్రము అట్టిది. అన్నగారికన్నను పొడుగుపాటి శరీరము, చక్కని మేనిచాయ, వ్యాయామాదులలో నైపుణ్యము,