పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

దుకుదండుగ, మంచి డబ్బు పాడుచేసుకొంటారు,' అని అడుగుతున్నాడు" అనిచెప్పిరి. "నాకు ప్యాసుకాకపోతే మరెవడికి అవుతుందో చెప్పమనండి చూతాం?" అని వేంకటరాయశాస్త్రిగారు కోపముతో పలికిరి. "మీఅబ్బాయికి ప్యాసయితే నాచెవి కదపా యిస్తాను." అని ఆపంతులు పందెము వేసెను. సరియని పైకము కట్టినారు, శాస్త్రులవారికి చక్కగానే ప్యాసయినది. పైగా మొదటితరగతి. అప్పుడువారు మదరాసులో చదువుటకు వచ్చియుండిరి. తండ్రిగారికి పైకము పంపి అతనికి బదులిచ్చి వేయుమనియు పందెము ప్రకారము ఆతనిచెవి 'కదపా' తీయించి పార్సెలుద్వారా తమకు పంపవలసినదనియు వ్రాసిరి. కాని ఆపంతులు పంపలేదు. 'కదపా' శబ్దమును అప్పుడు తాముగ్రహించినట్లు ఈకథను వారుచెప్పగా వింటిని.

  • "అనంతరము పది పదునొకండు రూప్యముల స్టయిపెండుతో మదరాసు నార్మలుస్కూలులో చదువుచు ట్రైనింగు పొందుట - అచట బహుజనపల్లి సీతారామాచార్యులవారు ప్రథమాంధ్రపండితులు, చదలువాడ సీతారామశాస్త్రులవారు ద్వితీయాంధ్ర పండితులు - ఇరువురుం బ్రామాణికులు, ఆంధ్రమున గొప్పపండితులు. వే - లు పిళ్ళలోనగు యాప్పాణపు గ్రిస్టియనులు సంగీతలోలురు, ఈ సీతారామాచార్యులతో చెలిమి చేసికొని వీరిప్రతి శనివార వేశ్యాదిసంగీతగోష్ఠులకు చందాదారులై వచ్చుచుందురు.