పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

ద్రావిడులయింట బుట్టినారు; నియోగుల (తెలుగువారి) యింట పెరిగినారు వారే యిట్లువ్రాసియున్నారు. "మదీయ నరసాపూరు చరిత్రము _ ఉపనయనమునకు మునుపటిది. ఉపనయనము గర్భాష్టమమున మల్లయ్యపాళెములో పులిపాక లచ్చన్న బాబుగారు, శేషమ్మపిన్నిగారు, చంద్రమ్మత్తయ్య, రవణప్పత్తయ్య - వారికి గోసమృద్ధి, పేరిన హైయంగవీనము, చక్ర కేళి యరటియాకు. వంట రుచి 12 సం. యనంతరము కూడ యథాపూర్వముగానే యుండుట. నెమళ్ల గొప్పయారామము. మా నాయనగారు కాపురమున్న యింటివారును పులిపాకవారే. కోడలో కూతురో అన్నపూర్ణమ్మ. అత్తగారు రవణమ్మ. ఆమెకు కుడిచేతి బొటనవ్రేలికి రెండుగోళ్లు. ఇరువురును వితంతువులే ఇంటియద్దె రు 1. వారు రాత్రి చేసికొను ఉప్పుపిండిగాని రొట్టెగాని నాతమ్ములకు తప్పదు. ఈ చెప్పిన మూడు కుటుంబములును అభేదప్రతిపత్తితో అత్యంతమైత్రితో నుండినవి. వారి యాయింటికి పిశాచప్రథ. ఆ పిశాచములు మేముపోడూరికి పోయినతర్వాత ఆయింట నివసించిన వారిని పీకుకొని తినుట - వేంకటరమణశాస్త్రులవారు మావారు అందుచే వారిని ఏమియు చేయమైతిమి అని పిశాచములు వాదించుట.

అన్నపూర్ణమ్మగారి యింట వేన్నీళ్లప్రొయ్యిలో టపాసులు కాల్చినందుకు నాయనగారు కొఱకచ్చు చేతగొని నన్ను జూడుటకు తఱుముకొనివచ్చుట. నేను నేలబావిని దాటి అందులో పాతము తప్పించుకొని తహశ్శీలుదారుగారి కచ్చేరికి