పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయిన కథ లిఖితముగాని ముద్రితముగాని నాకెచటను దొరకలేదు. నే నెనిమిదేండ్లవయసున నుండగా మానాయనగారు వేదము వేంకటరమణశాస్త్రులవారు తమమిత్ర బృందములో నీకథను ప్రస్తుతించునపుడు నేనును వింటిని వారుచెప్పుటలో నీకథ అరగంటకూడ పట్టలేదు. ఇటీవల నేను ఆంధ్రజనవినోదినీ ముద్రణాధికృతుడనై యుండగా 1888 సం. మున ఈకథను నాకుదోచినట్లు విరివిచేసి యల్లి కథారూపమున బ్రచురించి యుంటిని. పిమ్మట 1896 సం. జూలై నెలలో దానిని నాటకోచితముగా రూపుచేసి, ఈ నాటకమునందలి గద్యభాగమును మాత్రము వ్రాసి నామిత్రులకు జూపితిని......."

వేంకటరమణశాస్త్రులవారికి వేదాంతులు నలువురు శిష్యులు నిరంతరము వారితో గోష్ఠి సలుపుచుండువారు. ఒకరు ముసల్మాను, రెండవవారు చాకలి, మూడవవారు క్రిశ్చియను, నాలవవారు బ్రాహ్మణులు. సాయెబుగారు తమ మతగ్రంథములలోని వేదాంతవిషయములను చెప్పుచు "ఆ అరాబియా దేషంలో వఖ్‌పఖీర్" అను నీతీరున మాటలాడుచుండువారు. ఆ ఎనిమిదేండ్ల వయసున సాయెబుగారిమాటలు వేంకటరాయశాస్త్రులవారికి వింతగా కనబడినవి; హృదయమున నెలకొన్నవి. ఇట్టి సాయెబుల నెందఱనో కనియే ప్రతాపరుద్రీయ మందలి ఆమహమ్మదీయ పాత్ర భాషితములను వ్రాసితి మని వారే చెప్పియున్నారు.

శాస్త్రులవారికి ఆంధ్రాభిమానము హెచ్చు. పుదూరు