పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

వారు తమ పైపంచమీదనే ఆ తాటియాకునుంచి చీలకొట్టి యుండిరి. అదిమొదలు దయ్యములన్న నమ్మకము పూర్తిగానే వదలివేసిరి.

వేంకటరమణశాస్త్రిగారు విద్యభ్యాసానంతరము తొలుత మదరాసులో సంస్కృతాంధ్ర ద్రావిడ పాఠశాలలో ప్రధాన పండితులుగాను, కాకినాడ స్కూలు సంస్కృతపండితులుగాను, నరసాపురం నార్మలు స్కూలు ప్రధానోపాధ్యాయులుగాను, పోడూరు స్కూలు హెడ్మేస్టరుగాను, పిమ్మట విశాఖపట్టణము నార్మలు స్కూలు పండితులుగాను, అనంతరము రాజమండ్రి కాలేజి సంస్కృత ప్రధానపండితులుగా నుండి రు 25 లు. విరామ వేతనముం బొందిరి.

వేంకటరాయశాస్త్రులవారే తమతండ్రిగారింగూర్చి ఇట్లు వ్రాసియున్నారు.

  • [1] "నాయనగారు తాతగారివలెనే విద్వాంసులు, అప్రతిగ్రాహకులు, మహాకుటుంబి, నిఱుపేదలు, వైయాకరణ పతంజలి యనియు, వేదవ్యాసులనియు ప్రఖ్యాతులు, మహారసజ్ఞులు, అద్భుత సాహిత్యమండితులు, సౌజన్యపరమావధి, శిష్టులు, సత్యసంధులు, కరుణాపరాయణులు, యథాశక్తిత్యాగి, వారి సౌజన్యవిశేషములను ఎంతచెప్పినను తనివితీరదు.
  • * శ్రీ శాస్త్రులవారే తమ జీవితచరిత్రను, నాయొక్కయు ఇంకను తమశిష్యులయు ప్రోద్బలమున వ్రాయదలమచి కొన్నిపుటలు చిత్తువ్రాసి ఓపికచాలమిచే త్యజించిరి. అందలిభాగములను ఇం దుదహరించుచున్నాను.