పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

కొనెదమనియు తమ దృడసంకల్పమును తెలిపిరి. అంతట వారే వీరికి వారములు ఏర్పాటు చేయించి అన్నిశాస్త్రములును బోధించిరి.

వేంకటరమణశాస్త్రిగారు విద్యార్థులలో మేలుబంతి. ఉపాథ్యాయునకు చాల విధేయులు. తా ముద్యోగమునందు ప్రవేశించిన యనంతరము చిరకాలము వఱకు తమ జీతమునుండి పదిరూప్యములు గురువునకు కానుకగా పంపుచుండిరి.

వేంకటరమణశాస్త్రిగారు ఎన్నడును తిరస్కారవాక్యమును సహించినవారుగారు. ఒకనాడు కంచిలో వారములు చేయునొకయింట వృద్ధయొకతె కోపముతో 'వారం బ్రాంహలు వస్తారు. ఒకరైనా విస్తళ్లు తెచ్చుకోరు. వీళ్లకు విస్తళ్లు కుట్టి పెట్టలేకుండా చచ్చిపోతున్నాను' అని వేంకటరమణశాస్త్రిగారు వచ్చుచుండగా వారికి వినబడునట్లు పలికెను. ఆవాక్యము విని వెంటనే ఆయన ఆయింట ప్రవేశింపకయే ఎచటికో పోయెను. వేళకు భోజనమునకు రాలేదు. ఉపాధ్యాయుడును సహాథ్యాయులును ఊరంతయు వెదుకసాగిరి. ఆవృద్ధ యేడ్చుచు భోజనముమాని వీధితిన్నెపై కూర్చుండెను. వెదుకగా వెదుకగా సాయంకాల మగుసరికి ఊరిబయట నొక మఱ్ఱిచెట్టుక్రింద ఆకులుకోసి కట్టలుకట్టి ఒకరు క్రింద పడవేయుచుండ నొక విద్యార్థి చూచి ఎవరో యని పరిశీలింప వేంకటరమణశాస్త్రి. వెంటనే అందఱువిద్యార్థులునువచ్చిరి. ఉపాథ్యాయుడు ఆరోషమునకును పట్టుదలకును చాల ఆశ్చర్యపడెను. నాడు విద్యార్థు