పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమున ప్రథానస్థానము నందియుండెను. ఆంగ్లనాగరికతదేశమున నాటికి మొలకలెత్తలేదు; దేశ మింకను తన పూర్వనాగరికతావైభవమును కోలుపోలేదు; మార్పు ప్రారంభము కాలేదు. ప్రాచీనకాలమున, ఎచ్చటెచ్చటి విద్యార్థులును, తక్షశిల, నలంద మొదలయిన విశ్వవిద్యాలయములకు చేరునట్లు, నాడు విద్యార్థులు కంచికి చేరుచుండిరి. వేంకటరమణశాస్త్రులవారు నాటికి పండ్రెండేండ్లవారే యైనను, గత్యంతరములేమిచే, కాలినడకను బయలుదేరి కొన్నినెలలకు కంచికి పోయిచేరిరి.

వారు కంచి చేరునప్పటికి సాయంకాలమగుచుండెను. ఒకానొకచోట సంపన్నగృహస్థు నొకనింగని, వేదములు వల్లించుచు వారి యింటికింబోయి, నమస్కరించి వారిని నివర్తి వేంకటరామశాస్త్రిగారి యి ల్లెచటనున్నదని ప్రశ్నించిరి. ఆగృహస్థు వెంటనే ఆబాలుని చూచి, ఆతని సౌజన్యమునకును, వచ:శుద్ధికిని చాలసంతోషించి, శిష్టసాంప్రదాయమునకు చెందినవాడనియు, తన సహాధ్యాయికి మేనల్లుడనియు గ్రహించి "అబ్బాయీ, అనివర్తిసాస్త్రులు నేనే, మీమేనమామ గారున్నూ నేనున్నూకూడా చదువుకొన్నాము. నీవు మా యింట్లోనేవుండి చదువుకో. నీకు అన్ని అనుకూలాలున్నూ నేను చేస్తాను." అని ఆదరించిరి.

వేంకటరమణశాస్త్రిగారు వెంటనే వారికి సాష్టాంగముగా నమస్కరించి తమవారు గురువునింట భోజనము చేయకూడదని చెప్పిరనియు తాము మధుకరముచే భోజనముచేయుచు చదువు