పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపత్తులు గలిగియుండిరో వారిజాబుల చేతనే తెలియుచున్నది. శ్రీ వఝుల చినసీతారామశాస్త్రుల వారికి తాతాగారిచ్చిన యభిప్రాయములను వారు ప్రాణప్రదములను గాదలంచి పదిలపరచుకొని యున్నారు. వారి వసుచరిత్ర విమర్శను తాతగారెంతయో కొనియాడి యున్నారు. శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారికి ఆంధ్రవిమర్శకులలో నత్త్యుత్తమ స్థానమీయదగునని తమపుస్తకములో 'మార్జినలు నోట్సు'గా వ్రాసికొని యున్నారు. ఇట్టివారు పలువురుగలరు. గుణమున్నచో పొగడినారు; లేనిచోట నిజమును తెలిపినారు.

1929 సం, జూను 23 తేది వెలువడిన యుగంధరపత్రిక ఇట్లునుడువుచున్నది.

"స్వతంత్రమూర్తి, స్వాధీనుడు. వైలక్షణ్యము సహజము. ఆయన వాక్యరచనయందు, ఆయన ప్రసంగమునందు, ఆయనవ్యాఖ్యానాది టీకలయందు ఆయన బోధయందు, పద్యకవనమునందు - ఒకదానిలో గాదు తత్కృతులలో నొక్కొకదానియందు ఆయన స్వతంత్రత, స్వాధీనత, విలక్షణత ముద్రితములై యుండుట కన్నుగలవారుచూడగలరు. శిష్యవత్సలుడు. చలపట్టెనా ప్రత్యర్థినిపట్టి పల్లార్పవలసినదే. శరణమిచ్చెనా సమర్థించి రక్షింపవలసినదే. నిరంకుశుడు. నీతిపరుడు, భాషాప్రపంచమున సర్వతంత్రస్వతంత్రుడే, సర్వాధికారి. ప్రామాణికుడు పరిపూర్ణుడు. ఆసమయస్ఫూర్తి, ఆసందర్భశుద్ధి, ఆమేధాశక్తి, ఆప్రతిభ, ఆప్రజ్ఞ, ఆప్రయోగకౌశలము, ఆహాస్యవిలాసము, ఆఛలోక్తి, నిరుపమానములు. కనివినినవారిదే భాగ్యము.

"ప్రతివాదినెన్నడు గెలిచిపోనీయలేదు. ఆత్మకుప్రియముగ గ్రంథములరచించెనేగాని అర్థమునకైయాశించి పామరాభిరుచికై ప్రాకులాడలేదు. అడిగినసందేహము తత్క్షణముతీర్పవలసినదే......