పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తప్పింపగలవారు వారికి ముందును లేరు తర్వాతయు నుండబోరు. ఏవిషయమును గుఱించియైనను వారు వ్రాయబోవుచున్నారనగనే ఇతరు లాయుద్యమమును త్యజింపవలసినదే. వారు కావించినపని ఒక్కొకటియు కొందఱుపండితులు జన్మమంతయుంకూర్చుండి చేయదగినవి కాని ఒకరు చేయగలిగినవికావు. వారి యుపన్యాసములను గొప్పగొప్పపండితులే ఒకరి నోకరు త్రోసికొనివచ్చి వినువారు. వానిలో విషయము సమగ్రము; దుర్బోధమైన వ్యాకరణ విషయమైనను వారి హాస్యధోరణిలో నుపన్యస్తమైన సుబోధమగును. విసంధివివేకముంగూర్చి వారియుపన్యాసమును వినినశ్రోతలు కడుపులు చెక్కలగునట్లు నవ్విరనగా నికవేఱుగా చెప్పనక్కరలేదు. సమకాలికపండితులలో వారికి విమతులై ద్వేషించినయేకొలదిమంది పండితుల దోషములను కొన్నిప్రబలకారణములచే వెల్లడి గావించినారే గాని తదితరులయందు ఆదరాభిమానములు చూపినారు. శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు (మహామహోపాథ్యాయులు, కళాప్రపూర్ణులు) తాతగారి శిష్యులే. కింకవీంద్రఘటాపంచాననులు శ్రీ చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు తాతగారి ప్రశిష్యులే. ఈవిషయమును శ్రీయుత అల్లాడి కృష్ణస్వామయ్యగారియింట జరిగిన యొక సమావేశమున శ్రీ వేంకటశాస్త్రిగారే తమ యుపన్యాసముననొక్కి చెప్పియున్నారు. ఇరువురయందును తాతగారికి చాల ఆదరముండెడిది. శ్రీ గురుజాడ అప్పారావుగారు, వారితో నభిప్రాయ భేదముండియు, వారియెడ నెట్టి గౌరవ