పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహింపక, వారుచెప్పునట్టి తియ్యని మాటలను నమ్మి పలువిషయములలో మోసపోయిరి. కావుననే కొందఱు వారి నిజస్వరూపమును తెలిసికొనక వారిని దూషించుటయు తెలిసికొనినవారు చెంతచేరి వారిసర్వస్వమును భక్షించుటయు జరుగుచుండినది. తన్నాశ్రయించిన వారికి ఎన్నడును లేదని చెప్పి యెఱుగరు. వారి హృదయము మైత్రీకోమలము.

ఉద్యోగమును వదలిన తర్వాత విరామములేక భాషావిషయమై పరిశ్రమించిరి. అచ్చాపీసు ప్రారంభించిరి గాని, 1910 సం, ముననే దాదాపు ఇరువదిగ్రంథములను ముద్రింపగల్గినవారు, ఆతర్వాత శృంగారనైషధమునకు వ్యాఖ్య వ్రాయుచుండి నందువలన అన్నిగ్రంథములు ముద్రింపలేకపోయిరి. శృంగారనైషధ వ్యాఖ్యారచనానంతరము వచ్చిన చిక్కులచేతను, నెల్లూరు మదరాసు రాకపోకలచేతను, నిఘంటువుకై పడిన వృథాప్రయాసచేతను, విశేషగ్రంథరచనకును ప్రకటనకును సాధ్యముకాక పోయినది. సంస్కృతాంధ్ర వాఙ్మయములలోని గ్రంథములనెల్ల చక్కని వివరణాదికములతో ముద్రింపవలయునను గొప్పసంకల్పముతోనుండిరి గాని పరిస్థితులు సరిగానేర్పడలేదు. నిరంతరము కుడిచేతకలము, ఎడమచేత పుస్తకమును గ్రహించి తమకుదోచిన యమూల్యవిషయములను గ్రంథ కరండములలో పదిలపరచుచునేయుండిరి. ముద్రణక్రమమున తాతగారు ఆంగ్లపద్ధతులననుకరించిరి. పదములను విడదీయుటలో గాని, సులువుగా నర్థమగునటుల కామాలు, సెమికోలనులు