పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోరాడినవారు వీరు. జంగాలపాటలను చదివి, విని, ఆనందించి ఆఫక్కికనే తమనాటకములలో నవలంబించినవారు వీరు తప్ప ఇంకొకరు కానరారు. వ్యావహారికమున కథలు వ్రాయవచ్చునా కూడదా యనువిషయమునకు సమాధానముగా, 'గ్రామ్య ముచ్చరింపరానిచో 'పుల్సు' కథ నెట్లుచెప్పగలము' అనివ్రాసినారు. అనగా నట్టికథలు వానికి తగినభాషలోనే వ్రాయవలయునని గాని వీరగ్రాంథికమున వ్రాయవలయునని కాదు. సమయోచితముగా మెలగవలయునని వారి యభిప్రాయము.

ఉద్యోగదశలో తమధర్మమును తాముచక్కగా నిర్వహించినారు. అధికారులు మర్యాదకు వెలితిగా ప్రవర్తించిన విసిరికొట్టినారు. విద్యార్థులను లాలించినారు; వారివారి చిత్తవృత్తుల కనుగుణముగ బోధించినారు; తమయందు విద్యార్థులకు గౌరవప్రపత్తు లేర్పడునట్లు మెలగినారు స్వాతంత్ర్యమునకు భంగకరమైనపనులను తక్షణమే త్యంజించుచుండినారు. ఎచటనైనను తమకుద్యోగము లభించుననియు తమప్రజ్ఞకు అడ్డులేదనియు నెఱింగినారు. ఆదినములట్లేయుండినవి. 'విమతులకు పులి విశ్వాసభాజనులకు చెలి'. వారికి 'నిండుమనంబు నవ్యనవనీత సమానము; పల్కుదారుణాఖండల శస్త్రతుల్యము.' ఈ రహస్యము నెఱింగినవారు గుమాస్తాలుగాను శిష్యులుగానుచేరి పలువ గలద్రోహముచేసి 'ఏదయినా సత్తావుంటేగ్రహించి', పిదప పాదములపైబడగా మన్నించి మరల తమకడ చేర్చుకొనియున్నారు. తమ హితశత్రువులను విశ్వసించి, వారు శత్రువులను విషయము