పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి చైతన్యము లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది మంగళవారము వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.


__________