పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పలికి 'మీరు మనయూరికిరండు. మన శ్రీయుతులు బెజవాడ చంద్రశేఖరరెడ్డిగారితో గలిసి మాటలాడి ప్రయత్నింత' మనిరి. అంతకుబూర్వమే యీవిషయము చంద్రశేఖరరెడ్డిగారితో నించుక సూచించియుంటిని గాన ఒకతేది నిర్ణయించుకొని బుచ్చిరెడ్డి పాళెమునకుపోయి నేనును రామచంద్రారెడ్డిగారును చంద్రశేఖరరెడ్డి గారివద్దకుంజని ఈవిషయము వారికి విశదపరచి ఒక సుముహూర్తము నిశ్చయించుకొని ఆతేది మువ్వురము బుచ్చిరెడ్డిపాళియమున గలిసి రామచంద్రరెడ్డి గారిచేత రు 500 లును చంద్రశేఖరరెడ్డిగారిచేత రు 500 లును చందాపట్టికయందు వ్రాయించి మామువ్వురము నెల్లూరికివచ్చి వయస్సున పిన్నలయ్యును వదాన్యతయందు పెద్దలగు శ్రీయుతులు రేబాల పట్టాభిరామరెడ్డిగారిచేత రు 1000 లను చందావేయించి ఈ ప్రయత్నమంతయు వారికి విశదపరిచి వారిని ఒడంబరుచుకొని మానలువుర మొకసంఘముగజేరి ముఖ్యులగు రెడ్డిసోదరులచే కొన్నివేలు చందాలువేయించితిమి. పిమ్మట పట్టాభిరామరెడ్డిగారును నేనును కొంతధనమును, రామచంద్రరెడ్డిగారును నేనును మదరాసులో కొంతధనమును చందాలు వేయించితిమి. ప్రత్యేకముగా రామచంద్రారెడ్డి గారు శ్రీ వేంకటగిరికుమార రాజాసాహేబుగారివద్ద (ప్రస్తుతము రాజాసాహేబుగారు) వేయిరూప్యములందెచ్చియిచ్చిరి. రావుసాహేబు పొణకా వీరారెడ్డి గారును నేనును కొందఱిని దర్శించి కొంతధనము చందాలు వేయించితిమి. నేను స్వయముగానే కొంతమంది ప్రముఖులను