పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆముక్తమాల్యదా ముద్రణానంతరము తాతగారు గ్రంథములు వ్రాయలేదు; ఎప్పుడును మంచముననేపరుండి ఏదోచదువుచును వ్రాయుచు థ్యానించుచుండువారు. ఋణమొకటి యున్నది. అది తీరుట ఎట్లని నిరంతరము చింతించుచుండువారు. రాను రాను వారికి దిగులు వృద్ధి కాజొచ్చినది. శ్రీగునుపాటి ఏనాదిరెడ్డి గారికి జాబులు వ్రాయుచుండువారు. *"నాపేర వారమునకు రెండుజాబులు వ్రాయుటయేగాక అపుడపుడు ఋణదాతలు వ్రాయు జాబులను సైతము పంపుచుండిరి. నేనును ఇట్టి చందాలకుదిరుగు వాడుక లేనివాడ నగుటను తొల్లింటిపెద్దలు కలిసి రానందునను శ్రీవారి ఋణశల్యము నాహృదయశల్యమాయెను. 'మీరు ప్రయత్నించిన సర్వము జక్కవడును' అని శాస్త్రులవారాశీర్వదించుచుండిరి. 'ఇంత పెద్దమొత్త మెట్లు సమకూర్చ గలనాయని భయపడుచు, నావలన నేమికాగలదు శ్రీవారిప్రతిభయె సమకూర్చు' ననుధైర్యము వహించి, నామిత్రులును శాస్త్రులవారియం దభిమానాదర ప్రపత్తులుగల వారును ప్రస్తుతము (ఇదివ్రాసినదినములలో) శాసనసభాధ్యక్షులుగనుండు శ్రీయుతులు బెజవాడ రామచంద్రారెడ్డిగారితో నీవిషయము విన్నవించితిని. వారు విని 'ఈయప్పు శాస్త్రులవారు తీర్చవలసినది కాదు. మనముచేసిన యప్పుగాభావించి తీర్చవలసినబాధ్యత మనయందును ముఖ్యముగ మనరెడ్డి సంఘమునందేయున్న' దని


  • శ్రీ ఏనాదిరెడ్డిగారు ప్రకటించిన నివేదికనుండి.