పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

థారి లేకపోయెను. ఐననేమి, ఎవరినైనను తయారు చేయగలిగిన తాతగారు వెంటనే దొరసామయ్యంగారి మేనల్లుడు శ్రీ సుందరరాజయ్యంగారిని ఆపాత్రకు సిద్ధముచేసిరి. రంగారాయ పాత్రకు సుందర రాజయ్యంగారు కుదిరినట్లు ఎవరును తర్వాత కుదరలేదు. ఆవెలమబీరమును వీరియందే చూడవలయును వీరిని రంగమందు చూచువారికి ప్రాచీనరాజపుత్రవీరులు జ్ఞప్తికివత్తురు. తర్వాత నాయకపాత్రలను ధరించి ప్రసిద్ధికి వచ్చినవారు బెంగళూరు రంగస్వామయ్యంగారు. తొలుత నాయికాపాత్రములను ధరించుచుండిరి. ముమ్మడమ్మ వేషము మొదలు యుగంధరపాత్రము వరకును అన్ని పాత్రలను వీరుధరించిరి. వీరియుగంధరాభినయము చాలశ్లాఘనీయమైనది.

ఈవిధముగా నిరంతరము శిష్యులచే నాటకము లాడించుచు తాతగారు 1925 సం వరకు నెల్లూరిలో నుండిరి. సమాజమున తొలుత నుండిన శిష్యులు కొందఱు గతించిరి; కొందఱు రోగులైరి. శ్రీ దొరసామయ్యంగారు అసహాయోద్యమమున పాల్గొని జైలునుండి విడుదలయైవచ్చిన యనంతరము జబ్బులోపడిరి. శాస్త్రులవారి సమాజమునుండి వేఱుపోయినను గురువర్యులపై భక్తివీడలేదు. మరల తొలుతటి సమాజమునకు రావలయుననియే వారియాశయము. అసహాయోద్యమమున పాల్గొని జైలుకు పోయినవెంటనే తాతగారికి జాబువ్రాయుచు నాటకమున ఖైదుచేయబడినది అబద్ధమనియు, తాము ఖైదై వాస్తవముగానే ప్రతాపరుద్రు డనుభవించినదశ ననుభవించు