పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నను క్రమముగా శరీరమును క్రుంగదీసినది. ఏపనిచేయుటకును ఇచ్చలేకపోయినది. మఱపు అధికమైనది తుదకు అచ్చాపీసు వ్యవహారములయందు అశ్రద్ధ యెక్కువయైనది. ఈకాలమునందే తాతగారు సూర్యరాయనిఘంటు సంపాదకత్వమును వహించుట. తాతగారికి తుదిదినములలో కుమారునింగూర్చిన చింతయొకటి యేర్పడినది. మానాయనగారికి క్రమముగా శరీరమందు దౌర్బల్యమేర్పడి తుదకు నెల్లూరికేగుకాలమునకు ప్రాణాంతికమైనది.

తాతగారికి అనారోగ్యము వృద్ధికాజొచ్చినది. పాదములు రెండును వాచినవి. ఈవాపుమాత్రము చనిపోవువరకు నుండినది. స్వాములవారు అసహాయోద్యమములో పాల్గొని జెయిలుకు పోయినందున వారిసహాయము నిలిచిపోయినది. అప్పు ఒకటి క్రొత్తగానేర్పడినదిగదా యనుచింత హృదయశల్యమై బాధించుచుండెను. ఈకష్టపుదినములలో శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డిగారు వారిఋణవిముక్తికి తాముపాటుపడగలమని చెప్పుచు అందులకై ప్రయత్నములు చేయుచు వారిని ఓదార్చు చుండిరి.

శ్రీ రెడ్డిగారు తమనివేదికయం దిట్లువ్రాసియున్నారు. "ధనసంపాదనకై తొలుత వాగ్దానమొనర్చిన పెద్దలను పలుమార్లు సందర్శించి వారు నిర్ణయించు వాయిదాలకెల్ల హాజరగు చుంటిని.... ధనసంపాదనము జరిగినది కాదు. దినదినమునకును వడ్డి పెరుగుచుండెను. ఋణప్రదాతలు త్వరపెట్టసాగిరి. తొలుతటి