పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెలలకు ఎట్లో ప్రాణసంశయదశనుండి తప్పించుకొనిరి. దీనిచే వారికేర్పడిన శరీరదౌర్బల్యము మాత్రము తగ్గలేదు. డెబ్బది సంవత్సరములవయసు. మంచి యారోగ్యమునందుండినవారగుట 'నాకుకూడా ముసలితనం వస్తుందని నేననుకోలేదురా' అని నాతోపలుమార్లు వచించువారు కొన్నినెలలలో చాల ముసలివారైపోయిరి. పూర్వముండిన దార్డ్యముపోయినది. దౌర్బల్యమేర్పడినది. చరమదశ ప్రారంభమైనది. రానురాను మంచము మీదనే పరుండి యుండువారే గాని కుర్చీలోకూర్చుండి పనిచేయుశక్తి తగ్గిపోసాగినది. కూర్చుండుట బద్ధకమై క్షౌరమే మానివేయసాగిరి. గడ్డము పెరుగుటకు ఆరంభమైనది. పైగా నిరంతరము చదువుచునేయుండినందు చేతనో ఏమో కంట ఎల్లప్పుడును నీరు కారుటయు దృష్టి మందగించుటయు నేర్పడినవి.

ఈయుత్సవమైన కొన్ని నెలలకు తాతగారికి గొప్పదు:ఖము వాటిల్లినది. కలిమి లేములును సుఖదు:ఖములును కావడి కుండలుగగా. వ్యాధిగ్రస్తులుగా నుండిన మానాయనగారు, తాతగారికి ఏకైకసంతానము, 1922 సం డిసంబరు 14 తేది నెల్లూరి రంగనాయకులపేటలోని యింటిలో పరమపదించిరి. వార్థక్యమున కలిగిన యీదు:ఖముచే తాతగారు క్రుంగిపోయిరి. మానాయన గారిని తాతగారు అచ్చాపీసుపనిలో నియోగించిరి. చాలకాలము జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను వారు నిర్వహించుచుండిరి. వారిది చక్కని అపరంజిని బోలిన శరీరచ్ఛాయ. వ్యాయా