పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకు ప్రయత్నించు చుండిరి. చూచితిరా! విధివిలాసము. అప్పను మాటలేక కాలము గడుపగోరి అచ్చాపీసునే విక్రయించి నిశ్చింతగా కాలము గడుపుచుండిన భ్రాహ్మణునికి దైవము మరల ఋణమును అంటగట్టినది.

ఆసంవత్సరమే జూలైనెలలో తాతగారికి అఖండగౌరవము జరిగినది. పూర్వము వారికి క్రిశ్చియన్కాలేజిలో శిష్యులుగా నుండి అనంతరము సన్న్యసించి అప్పుడు జగద్గురువుగా శ్రీ శంకరాచార్యస్థాపిత శారదాపీఠము నధిష్ఠించిన భారతీకృష్ణ తీర్థస్వాములవారు (ఇప్పుడు పురిస్వాములవారు) తమపూర్వాశ్రమ గురువులైన శాస్త్రులవారికి గొప్పసత్కారముచేసిరి. నెల్లూరిలో సర్వజనీనమగు నిండోలగ మొకటి జరిపి అందు తాతగారికి ఆఱుబిరుదములను 'మహామహోపాథ్యాయ, విద్యాదానవ్రత మహోదధి, పండితరాజ, వేదవేదాంగశాస్త్రజాల మహోదధి, సనాతనధర్మరత్నాకర, సర్వతంత్ర స్వతంత్ర" యను వానిని ఒసంగిరి. పైగా పుత్త్రపౌత్త్ర పారంపర్యముగా నెలకు నూటయేబది రూప్యములు తమ మఠమునుండి పంపుచుండున ట్లేర్పాటు గావించిరి. ఆసభకు దక్షిణ భారతదేశమందలి ప్రముఖు లెందఱో వచ్చియుండిరి.

ఆసంవత్సరమే తాతగారికి చాలజబ్బు చేసినది. ఇంటిలో ప్రవేశించిన ముహూర్తమని కొందఱు తలంచిరి. శాస్త్రులవారు ఈదెబ్బలో చనిపోవుదురని యెల్ల వారును భయపడిరి. కొన్ని