పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచి విషయములందెలుపుచు మమ్మాదరింపవలయు^' నని కోరిరి. 'సరి మంచికార్యమే, నాయూర, నాశిష్యుల, మిత్రుల మధ్యను నివసించుటకు నేనును సంతసించెదను. ప్రస్తుతము ఉద్యోగమును మానుకొంటిని కుటుంబభారము నెక్కుడయినది. వృద్ధతయు ఋగ్ణతయు నధిగమించుచున్నవి. మదీయ గ్రంథ విక్రయమున గాలము గడపుచుండు నేను వేలకొలది వ్యయించి యిల్లుగొనుట యెట్లు ఘటిల్లును?' అని శాస్త్రువారు సెలవిచ్చిరి. 'ద్రవ్యమునకై మీరాలోచింపవలదు ఆభారము మాయందున్నది.' అని పెద్దలు వాక్రుచ్చిరి. 'అట్లైన నిల్లు గొనివెట్టు'డని శాస్త్రులవా రిచట నివసించుట కంగీకరించిరి...శ్రీమాన్ నే. తిరువెంగడాచార్యులు గారు రంగనాయకుల పేటయందు రు 4500 ల కొకయింటి నేర్పాటుంజేసి తెలియజేసిరి... విక్రయ ధనమునకుం దొందరకలిగి మొదట వాగ్దానమొనర్చిన మహనీయులను తొందరచేయ సాగితిని. ఈతొందరలో జందాపద్ధతిని ధనమొడ గూర్చుటకు వ్యవధిలేదు. ప్రస్తుత మేబ్యాంకిలోనైన నప్పుచేయించి చెల్లించి నెమ్మదిగ మనము ప్రముఖుల సందర్శించి ధనము గడించి అప్పుతీర్చుట లెస్స' యని మైదవోలు చెంగయ్య పంతులవారు సలహానిచ్చిరి. అందరును సమ్మతించిరి."

వెంటనే అయిదువేలరూప్యములకు ఈక్రొత్తయింటిని మామదరాసు ఇంటిని రెంటిని అడుమానము పెట్టించి తెచ్చిన పైకముతో ఆయింటిని కొనిరి. తాతగా రాయింట నివసింప నారంభించిరి. ఆపెద్దలు ధనము వసూలుచేసి ఆయప్పును తీర్చు