పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బించి పనిచేయనిచ్చియుండిన ఇప్పటికి గ్రంథములనుండి శబ్దాన్వేషణమయినను ముగిసియుండును.

నిఘంటుసభ కార్యసాధకముగాదు.

సంపాదకుడు ఇట నుదాహరించుటకు తాను ఇచ్చగింపని కొన్నిప్రబల కారణములచేత ఈయనంతరవిషయమును రూడిగా జెప్పుచున్నాడు:-

నిఘంటుకార్యస్థానమును, పరిషత్కార్యస్థానమునగాక దానితో నెట్టిసంబంధమునులేనిదిగా దానికి కడుదూరముగా వేఱొకగృహములో, ఉంచి, నిఘంటుసభయిక్క సమావేశములును దానిచర్చలును ప్రధానసంపాదకునికిందక్క కడమ నిఘంటుకార్యస్థాన నియుక్తులకును, పరిషత్కార్యస్థాన నియుక్తులకును బొత్తిగా తెలియకయుండునట్లు సాధించియుండినయెడల, ఈజరిగిన నిఘంటుకార్యము ఇంతకన్న మిక్కిలి చక్కగా నెఱవేఱియుండును.

ప్రధానసంపాదకుడు,
వేదము వేంకటరాయశాస్త్రి.
మదరాసు.
1-11-17

అయ్యా, ఈక్రిందిపంక్తులను సానుగ్రహులై చిత్తగింపబ్రార్థించు చున్నాడను.

ఈనివేదనమును నేనువిశదీకరణార్థమై మొక్కపాటి సుబ్బారాయుడు గారికి పంపితిని. ఆంధ్రసాహిత్యపరిషన్మంత్రిసభలో తామొకసభ్యులైన సుబ్బారాయుడుగారు, 3-11-1917 తేదిలో ఆసభలో దీనిని మదనుమతింజెంది పఠించి యిందులవిషయములకు తమయంగీకారముందెలిపిరి. అందఱు నంగీకరించిరి. అగ్రాసనాసీనులైన శ్రీయుత జయంతి రామయ్యపంతులుగారు మాత్రము ఇందుపన్యస్తములయిన కాయికక్లేశములు నాకొక్కనికే చెందినట్టివని వక్కాణించిరి. అందులకు నేను "నేనిపుడు పనిచేయగూర్చుండుచోట ఇంచుకసేపు కూర్చుండువారికెల్ల ఆబాధలెల్ల సంభవించును." అని వచించితిని.

శ్రీ పిఠాపురము రాజాగారు తమకోరినప్రకారము నిఘంటునిర్మాణ కార్యమును మదరాసునుండి కాకినాడకేని పిఠాపురమునకేని కొనిపోయి తమ సమీపముననే, తమయాధ్యక్షముననే, అట్లయినను ఆంధ్ర సాహిత్యపరిషత్తు