పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచికాలమును పాడుసేయునవైన యసాధ్యాసంభావ్యోద్యమములను కల్పించుచుండిరి.

ఈనడుమ నిఘంటుసభవారు పదసంగ్రహణార్థమై బయటి పండితులకు కొన్నిగ్రంథములను నియమించుచు వానిలో ఇంతకుపూర్వమే ప్రధానసంపాదకుడు పఠించి జ్ఞాపికలు వ్రాసినపుస్తకములలో నాలుగింటిని-

1. నన్నెచోడుని కుమారసంభవము
2. శ్రీనాథుని హరవిలాసము
3. కేతనదశకుమారచరిత్రము
4. రామరాజీయము.

అనువానినిచేర్చిరి. ఇందుల కాతడు ఆశ్చర్యపడియు తా జేయుపనికిని బయటి పండితులుసేయుపనికిని గలుగు తారతమ్యము తనకును నిఘంటుసభవారికిని ఆయేర్పాటుమూలముగా బోధపడునుగాక యనుతలంపున దానిని ఆక్షేపింపక యూరకుండెను.

సభ్యులు కొందఱు కాకతాళీయముగా ప్రధానసంపాదకుని వ్రాతలందు ఏపుటలోనేని ఏపంక్తినేని తిలకించి అందలి సూక్ష్మ విషయములంగూర్చి 'ఈపదము వ్రాసి యుండవలసినదిగాదు; ఈపదము అనావశ్యకముగా వివరింపబడినది; ఈయర్థమునకు ప్రమాణములు అనావశ్యకముగా వ్రాయబడినవి?" అని యీతీరున నభివ్రాయములను అసాధువులనే వాక్రుత్తురు. అతడు చేయుచున్నపనిలోని గుణమును విశేషజ్ఞులుమాత్రమేగ్రహింపగలరు. వారేనియు కాలము వినియోగించి యవధానమొసంగిననేగాని యెఱుంగనేరరు. సాధుత్వమునకు ప్రామాణికత్వమునకును వలసినంతయాదరమును సభవారు వహింపలేదని సంపాదకు డభిప్రాయపడుచున్నాడు.

నిఘంటువును ఒక్కటేకట్టడముగా సమకట్టుటకును, దానిభాగములను యౌగపద్యమునంగాని, యథాక్రమమునంగాని, ఏవరుససరియో యావరుసను, కట్టించుటకై సంవిధానముసేయుటకును, సభవారు సంపాదకునికి అవకాశ మిచ్చుటలేదు. పునాదికంటె ముందుగా గోడలను లేపుమందురు, గోడలకంటె కంబములకంటెనుముందుగా మిద్దెకట్టుమందురు. ఆతనిని తనపద్ధతులనే అవలం