పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. మనుచరిత్రము
2. పారిజాతాపహరణము
3. పరమయోగివిలాసము
4. పాండురంగమాహాత్మ్యము
5. భోజరాజీయము
6. శ్రీ కాళహస్తిమాహాత్యము
7. నరసరాజీయము
8. కవికర్ణరసాయనము
9. గౌరనహరిశ్చంద్ర ద్విపద

నిఘంటుసభానియమములవలనను తత్కార్యాలయములవలనను సంభవించిన యిబ్బందులు లేక పగటివేళ చల్లనిసమయములలో, కంపు, శ్వాసనిరోధము, కన్నులయెదుట మింటి యుగ్రదీప్తి, ఎండవడయు, లేనితావులయందు, కాలనిర్భంధములేక, పనిచేయుచో తాను ఏపాటిపనిచేయగలడో చూచికొనవలయునను నుద్దేశ్యముతో ప్రధానసంపాదకుడు ఆవిరామ మాసములో ఆగ్రంథములను పఠించినాడు: ఆదినములలో ఆతనికితోడుగా నొకపండితుడుండెనేని, 9 కి బదులు 18 గ్రంథములను చదివియుండును. ఇందువలన పరిషత్కార్యస్థానములో ఆతనిపని కేర్పడిన సంవిధానములు శీఘ్రకరణమునకు ప్రతికూలము లగుట తెలియనగుచున్నది.

ఈ రెండుసంవత్సరములలో రు 50, 40, ల జీతగాడు ఒక పండితుడు సాయముగా నీయబడి యుండినయెడల, ప్రధానసంపాదకుడు తనకావించిన పనికి రెండింతలుచేసియుండును. అట్టి పండితుని ఇచ్చుట ఆవశ్యకమని ఆతడు ఒకటియునర సంవత్సరమునకుపైగా విసువక నిరంతరము హెచ్చరింపగా, 5 నెలలక్రిదట రు 35 ల జీతమున నొకనిని నియోగించినారు.

నిఘంటుకార్యస్థానములో జరుగుచున్నపనులలో నిఘంటువు నిమిత్తమై ప్రయోజనపడునట్టినది - ఇంతకాలము అసహాయుడుగాను , ఇప్పుడు ఆ సహకారితోను ప్రధానసంపాదకుడు చేయుచున్నపని యొక్కటియే.

ప్రధానసంపాదకుడు చేయుచుండిన పనియొక్క గుణమును రీతిని బోధచేసికొనక నిఘంటుసభవారు ఒకప్పుడు కొందఱు సభ్యులయుత్సాముచే అతనియందు అలసతాదోషమును ఆరోపింపనెంచిరి. అంతలో మరల, ఆత