పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినను అందుచెప్పని యర్థములలో ప్రయుక్తములును అగు పదములను గ్రంథములనుండి వెదకి సమకూర్చుటకై నియమించుట మంచిదని ప్రధానసంపాదకుడు బోధించెను. ఆపనిని నిఘంటు సభవారు చేసినవారుకారు. ఆపని చేసియుండినయెడల ఇప్పటికి పదాన్వేషణకార్యము సమాప్తి జెందియుండును.

పదాన్వేషణనిమిత్తమై అధమపక్ష 200 పుస్తకములను పఠింపవలయునని నబంధించినారు. అందులకై 110 పుస్తకముల జాబితాను ప్రధానసంపాదకుని కిచ్చినారు. వానిలో ఆతడు స్వయముగా భారాతాదికములగు పుస్తకములనుచదివి వానినుండి పదప్రభృతులను సంకలించియున్నాడు. ఆ 20 గ్రంథము లెవ్వియెన:-

1. ఆంధ్రభారతము
2. కాశీఖండము
3. లక్ష్మీనరసింహపురాణము
4. నన్నెచోడుని కుమారసంభవము. పూర్వభాగము
5. అదే ఉత్తరభాగము
6. కృష్ణరాయవిజయము
7. భీమఖండము
8. కేతనదశకుమారచరిత్రము
9. వేంకటపతి సారంగధరము
10. హరవిలాసము
11. నిర్వచనోత్తరరామాయణము
12. ఉత్తరహరివంశము
13. కళాపూర్ణోదయము
14. ఆముక్తమాల్యద
15. రామరాజీయము
16. శృంగారనైషధము
17. యాజ్ఞ వల్క్యస్మృతి
18. వేంకటపతి విజయవిలాసము
19. ఎఱ్ఱనహరివంశము పూర్వభాగము
20. అదే ఉత్తరభాగము.

ఇందు భారతేతరములయిన 19 గ్రంథములను చదువుటకు ప్రధానసంపాదకునికి 4 నెలలు పట్టినవి. ఇచ్చట ఆనుషంగికముగా ఈక్రిందివిషయము చెప్పవచ్చును. ప్రదానసంపాదకుడు స్వతంత్రముగా కైకొన్నకార్య విరామ మాసములలో వినోదార్థముగాను అలసతాపనోదార్థముగాను స్వబోధార్థముగాను ఈక్రింది 9 గ్రంథములనుంబఠించి వానిపై ఆ 20 టి పైనింబోలె జ్ఞాపికాపుస్తకములను వ్రాసినాడు. ఆ 9 ఎవ్వియన:-