పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రతయందు అష్టమాంకము...చూడగా లక్షణవేత్తృతయు రసికవిద్వత్కవితయు భోధ్యమానము లగుచున్నవి."

ఉషానాటకముంగూర్చి - ఉషానాటకము సాంగముగా చిత్తగింపబడియె. అందు ప్రథమాంకములో 21 వది 'సరవిన్ వేడికిడస్సి' యనుపద్యము షడృత్వభివ్యంజక శబ్దజాలంబుతో నుత్తరాంకార్థసూచ కాంకాస్యనామకసూచ్య లక్షణత్వ సంపన్నంబై యత్యంతరసవంతంబై యపూర్వకల్పనాకల్పంబయి యున్నయది. తృతీయాంకమందున్న పద్యము 'సంజవేళ లేతజాజొంది' యనునదియు 'చందునకాత్మ బింబసదృశంబుగ' అను నదియు నీరెండు పద్యములును నసంభూతోపమాలంకారము గల్గి యస్మద్దేశ కవికల్పనా సంప్రదాయాను రూపములై హౌణ కవీశ్వర షేక్స్పియర్ ప్రముఖ వర్ణనాస్వభావ సంపన్నంబులై సొంపుగ సహృదయదయానందంబుగా నున్న యవి."-

శాస్త్రులవారి శృంగారనైషధవ్యాఖ్యను వారు చిత్తగించినవిధముంగూర్చి శాస్త్రులవారే యిట్లు తెలిపియున్నారు. "మదీయ శృంగారనైషధవ్యాఖ్యను ఆదొర చిత్తగించి దాని నిస్తనశల్యపరీక్షగావించి చదివి శోధించి, తమ్ముదర్శించుటకు నాకు నాలుగుమాసములు తీఱనందున ఆనాలుగుమాసములును వేచియుండి, అనంతరము మౌంటురోడ్డు మోతీమహలులో దర్శనమనుగ్రహించి, రెండుగంటలకాలము ఆగ్రంథమునందలి మదీయసంస్కరణ వివరణాదులను పెక్కింటిని ఉద్ఘాటించి ఉగ్గడించి, తుదకు నాకు రు 400 లు పసదన మొసంగిరి. అందు