పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."

ఈప్రభువు విద్వత్పోషకుడేగాక స్వయము విద్యావంతుడు.

శాస్త్రులవారి యాంథ్రాభిజ్ఞాన శాకుంతలముపై వారి యభిప్రాయము-"ఆంధ్ర గీర్వాణములయందు తమకుగల సరసపాండిత్యము స్ఫుటంబయ్యె. మూలగ్రంథభావము పోకుండనున్నయది. ఒకానొకచోట భావభేదంబున్నను దెనుంగున కయ్యది మేఱుంగు పెట్టినట్లే కానంబడుచున్నది."

ప్రతాపరుద్రీయము వీరికే అంకిత మొసంగబడినది. దీనింగూర్చి వీరియభిప్రాయము, కొన్నిపుటలది, అముద్రిత గ్రంథచింతామణి యందు ప్రకటింపబడినది. ఇయ్యది ఏలినవారి వైదుష్యమును చాటుచున్నది. అందలివాక్యములు రెండుదాహరించెద.

"తమరంపిన ప్రతాపరుద్రీయనాటకము తెనుగుచూడబడియె. మిగులరసవంతముగా నున్నది.... కథాసంవిధాన చతు