పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హముగావించిరి. శృంగారనైషధ ప్రకటనకాలమునకు 1913 సం. జనవరికి, ఏతజ్జీవితచరిత్రరచయితను నేను జనించి రెండు మూడు నెలలై యుండినవి. శాస్త్రులవారికి అఱువది సవత్సరములై యుండినవి. తాతగారైరి కాని మంచి యారోగ్యము నందుండిరి.

1914 సం. నవంబరు 18 తారీఖున నెల్లూరు, మూల పేటలో నొకగృహమున నచ్చాపీసును స్థాపించిరి. మదరాసులో నున్నంతకాలము అచ్చాపీసు ఎట్లెట్లోజరుగుచుండెను. ఆంధ్ర దేశమందలి విద్వాంసులెల్ల తమతమ గ్రంథములను జ్యోతిష్మతి ముద్రాక్షరశాలయందే ముద్రింపించుకొనుచు వచ్చుచుండిరి, నెల్లూరికి వచ్చినంతనే ఆపని దొరకదాయెను. సొంతగ్రంథములకు మాత్రమేయైనచో ఆయచ్చాపీసు చాలదొడ్డది. వ్యాపారస్తులవలె కనబడిన గ్రంథములనెల్లను తాతగారు ముద్రింపరు. తాము పరిష్కరించి సరిజూచినగ్రంథములే తమ పేరిట నచ్చుకావలయునని నియమము. ఈకారణముచే సొంతప్రచురణముల సంఖ్య తక్కువగానే యుండెను. వాని విక్రయముచే నచ్చాపీసంతయు జరుగునంత వ్యాపారము లేదాయెను. ఇది మొదలు చిక్కులు ప్రారంభమైనది. పెద్దయచ్చాపీసుకు పని పెట్టవలెను, తగిన వరుంబడిలేదు.

వేంకటరాయశాస్త్రులవారు ప్రారంభించిన గ్రంథముద్రణ వ్యవసాయమునకు ఆటంకము లెట్లువచ్చినవో చూడుడు.