పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్దేశ్యముగనో సంభవించినదో అది విచారణీయమని సాహసించి నివేదించితిని. ఆముక్తమాల్యదయొక్క కర్తృత్వము అల్లసాని పెద్దన్నకు కొందఱిచే అర్పింపబడియుండుట న్యాయము కాదనియు, అది కృష్ణదేవరాయకృతమ యనియు, సిద్ధాంతీకరించిన వారగుట శ్రీశాస్త్రులవారికి నేను బహిరంగపఱచిన మీమాంస ఆశ్చర్యమును కలిగింపలేదు; అసహ్యముకాలేదు. కానికొందఱు పండితులు కోపపడిరి. సహజమేకద. నూతనాభిప్రాయములు అలవాటునకు వచ్చుటకు కాలముపట్టును గదా. ఈమధ్యలోనవి కొన్నియెడల కొందఱిలో మనస్తాపము కలిగింపకయుండునా? కాని శ్రీ శాస్త్రులవారియొక్క మనోవైశాల్యము కొలదికి మించినది. ఏవిషయమైనను సరే, క్రొత్తదిగా నుండనీ, ఆగమాచారములకు విరుద్ధముకానీ, వేగిరపడక, ఆగ్రహింపక, శాంతముగ ఆమూలాగ్రముగ పరిశీలించి, సత్యశోధనపరాయణత్వమును ప్రకటించువారిలో వీరు అగ్రగణ్యులు. కావుననే వీరియభిప్రాయములు సమరసములు సహృదయసమ్మతములునై యున్నవి.

శ్రీశాస్త్రులవారి యంతిమదశలో నెల్లూర వారియింటికిబోయి కృతప్రణాముడనై కొంతసేపు సంభాషించితిని. శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డి గారిచే బ్రసాదింపబడిన పౌరసౌధమున అలంకారములమీద వారు అద్భుతమైనరీతిని ప్రసంగింపగా ఆనందపారవశ్యముం జెంది కొన్ని మాటలతో, అనగా అసం