పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏభాషయైనను వేంకటరాయశాస్త్రులవారు వ్రాయగలరను దృడమగు నమ్మకము అప్పారావుగారి కేర్పడియుండినది. ప్రతాపరుద్రీయమును రచించిన ప్రతిభాశాలి ఎట్టి శైలియైనను వ్రాయసమర్థుడనియు వ్యావహారికభాషాశైలి వారికడ నాంధ్రులునేర్చుకొనవలసినదేగాని ఇతరత్ర అసాధ్యమను నుద్దేశముతో కాబోలు 8-జన-1914 తేది యొకజాబులో నిట్లువ్రాసియున్నారు.

"I have to ask you one question. You used in your plays various class dialects on the ground of ఔచిత్యము. Why did you omit the best of them, i,e, the language of the cultured Brahmans. Is there no use for it any where? Does not the same ఔచిత్యము require that characters of a certain social standard use it ?" అని

ఈజాబులకు శాస్త్రులవారేమి జవాబువ్రాసిరో తెలియదు. శాస్త్రులవారి జాబులుదొరకిన నదృష్టవంతులమే. కాని అప్పారావుగారు కోరినపనిమాత్రము వారుచేసినట్లు లేదు. భాషను సులువుపఱచనగును; ఆయావిషయములకు తగినట్లు ఔచిత్యముంజూచుకొని వ్రాయవచ్చుననియే శాస్త్రులవారి యభిప్రాయము. ఎవరికితోచినట్లు వారు 'ఎల్లామాట్లాడుతామో అల్లావ్రాయాలి' అనుమతమును శాస్త్రులవారు ఎంతమాత్ర మొప్పుకొనలేదు. మఱి శాస్త్రులవారి యభిప్రాయమేనగా శబ్ద