పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోత్తరపు జిల్లాలగ్రామ్యములు పెక్కులుగలవు. ఒకజిల్లాగ్రామ్యము మఱియొక జిల్లావారికి తెలియదు సరిగదా అసహ్యముగా కూడనుండును. ఇవిగాక యిన్ని జిల్లాల నానాజాతుల గ్రామ్యములుకలవు. అందులో మనజిల్లావే అనేకములు మనకే తెలియవు.

నిర్బంధగ్రామ్య ప్రాబల్యముచే అగ్రామ్యగ్రంథములు మూలబడును. మనపూర్వులమహిమ, వారుమనకై గ్రంథరూపమున నిక్షేపించి పెట్టిపోయిన ధర్మనీతిజ్ఞాన విజ్ఞానములు, వారికవనములసొంపు, రామకృష్ణాద్యవతారమూర్తుల దివ్యచరిత్రములు, కృష్ణరాయాది మహాపురుషుల వైదుష్యాది విశేషములు, సర్వమును ఆంధ్రులకు అబ్బని లిబ్బియగును. ఆపారంపరిచే ఆంధ్రులకు, గీర్వాణగ్రంథములుకూడ మూలబడును.

........ఆంధ్రమహాజనులు దొరతనమువారికి విన్నవించుకొని ఈ నిర్బంధ గ్రామ్యమును వెంటనే తొలగించి మఱి తల చూపకుండం జేసికొనవలయుననియు హైస్కూలు ఫారములకును ఇంటర్మీడియేట్ బి.ఏ., పరీక్షలకును ఏదేనొకదేశభాష (వర్నాక్యులరు) మునుపటివలె అవశ్యపఠనీయముగా జేయించుకొనుడనియు మహాజనులకెల్ల మదీయవిజ్ఞాపనము.

ఈయుపన్యాససారముకొఱకే మరల గురుజాడ అప్పారావుగారు ఇట్లువ్రాసిరి.


12th june 1912.

Dear friend,

Please accept my sincere thanks for your kind note of the 9th inst. I have the first edition of Kathasarithsagara at home. Please order your publisher to send me a copy of the new edition when it is out by V.P.P. I have not yet received the booklet which you promised to send as a specimen.