పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలంద్రోచి - ఒజ్జలు నేర్పుజిత్తులచేత అర్ధకల్పముగా నుత్తరమువ్రాయందగు ప్రశ్నపత్త్రముల నిచ్చుచుండుటచేతను, ఎట్లువ్రాసినను 100 కి 80-90 మందికి జయము తప్పనందునను, ఈకాఠిన్యముకలిగినది.

కావున పైపొరబాటులను సవరించుకొనినయెడల ఈమిథ్యా కాఠిన్య మిథ్యాసౌలభ్యములు తొలగును.

లాటినుమాని డాంటి ఇటాలియనులోవ్రాయుట మనపూర్వులు సంస్కృతమునుమాని యాంధ్రములో గ్రంథములను వ్రాయందొడంగుట వంటిదిగా గ్రహింపవలయునుగాని అగ్రామ్యస్థానమున నిర్బంధపూర్వకముగా గ్రామ్యము పెట్టుటవంటిదిగా నెన్నదగదు. ఏలయన రసజ్ఞులు కారణవిశేషములంబట్టి గ్రామ్యమందు గ్రంథములను వ్రాసికొందురుగాక, బొబ్బిలిపాటయు దేశింగురాజు పాటయు గ్రామ్యములేగదా, ఆరాధ్యమల్లనరచించిన జంగాల బొబ్బిలి పాటలోని రసములో శతాంశమయినను రంగరాట్చరిత్ర పద్యకావ్యమునలేదు.....అట్లేగ్రామ్యమున సుద్దులును కథలును గద్దెలును రసవంతములు గలవు. 'వాక్యం రసాత్మకంకావ్యమ్మ'ని గదా విశ్వనాథకవిరాజు అనుశాసించినాడు. అది హృదయంగమముగాని, బాలురపాఠపుస్తకములను గ్రామ్యమున వ్రాయుటయు, ఆగ్రామ్యపుస్తకములను దొరతనమువారు నిర్బంధపూర్వకముగా పాఠశాలలో చదివించుటయు, అసమంజసము.

ప్రతిగ్రామ్యమును సర్వజనీనమనుట సరిగాదు. గ్రామ్యములు పెక్కుదెఱంగులు. గంజాంజీల్లా యోడ్రగ్రామ్యము, విశాఖపట్టణ రాజమేహేంద్రవరాది హిందూస్థానీగ్రామ్యము, నెల్లూరు కడపజిల్లాల శుద్ధగ్రామ్యము, మదరాసు చిత్తూరు తంజావూరు సేలము తిరుపత్తూరు మధుర తిరుచనాపల్లుల యఱవ గ్రామ్యములు, బల్లారి బెంగుళూరుల కన్నడగ్రామ్యము, కర్నూలు హైదరాబాదుల తురకగ్రామ్యము,, ఇంక ధార్వాడ బెల్గాముల కన్నడ మరాటి గ్రామ్యము, ఈతూర్పునాటి మనకు గోడవలెనుండు హైదరాబాదు పశ్చి