పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిడుదవోలులో 1912 సం. మున గ్రామ్యవాదమును ఖండించుటకును గవర్న మెంటువారికి నిర్బంధగ్రామ్యమును తొలగించుట కొకవిన్నపము కావించుటకును ఒక సభకూడినది. ఆ సభలో శాస్త్రులవారు ఇట్లుపన్యసించిరి.

  • గంగాదేవి నారాయణపాదమందు జనించి పరమశివునిచే మూర్ధంబున లాలితమై నగాధిరాట్చృంగంబున విలసిల్లి దిగివచ్చి హరిద్వార వారణ స్యాదులమీదుగా నానాదేశములం బవిత్రీకరించి కడపట సకలకశ్మల సమృద్ధయై సముద్రమునంబడి తన్మ యత్వముంబొంది అస్పృశ్యయై అపేయయై నష్టరూపయైపోయినట్లే వాగ్దేవియు పద్మజాతమనోజాతయై చురుర్వేదీమహితములయిన యాచతుర్ముఖుని ముఖంబులందు విలసిల్లి వాల్మీకివ్యాసకాళిదాసాదుల వదనంబులం బరిడవిల్లి మనయాంధ్ర దేశంబునకుందిగి తెలుగై రాజరాజనరేంధ్ర కేష్ణరాయాదులు యాస్థానములయందు మహితయై నానాదిగ్దేశంబులం బవిత్రీకరించి కడపట నిక్కాలంబునం బ్రాయికంబుగా తెగులై సకల కశ్మలసమృద్ధయై గ్రామ్యప్రాయతంజెంది అనుచ్చారణీయయు అనాకర్ణనీయయునై రూపహానిం జెందుచున్నది.

చిరకాలము ఆంధ్రవాగ్ధేవిని సంస్కృతాంధ్రోభయ భాషాప్రవీణులైన వాగనుశాసన సోమయాజి పెద్దనార్యప్రభృతులు మహోన్నతదశయంద యుంచి పూజించిరి. ఇటీవల రాగారాగా ప్రాయికముగా సంస్కృతమెఱుగనికవులు, చదువనికవులు, సమాస మొల్లనివారు, అలంకారమునొప్పనివారు, యతిప్రాసల హితశత్రువులు, అక్షరద్వేషులు, ఔచిత్యబాహ్యులు-ఏవమాదులు వాగ్దేవికి ఈచరమదశను సాధించినారు.

ఈదశలో.....భావివాఙ్మయమునెల్ల గ్రామ్యతంబొరయింప నొకయుద్యమము తలసూపియున్నది. ఆగ్రామ్యవాదుల వాదసారము ఇదిగా కానిపించుచున్నది.-


  • గ్రామ్యాదేశ నిరసనము.