పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రీతులను సయితము ప్రతాపరుద్రీయమున చూపినారు మఱి యీక్రొత్తవాదమువచ్చినంతనే విసంధినిగూర్చి యొక యుపన్యాసమొసంగిరి. "సంహితఏకపదమందు నిత్యము (ఉ.వనేన.ఇచ్చెను) ధా,తూపసర్గలకునిత్యము (ఉ. ఉపాన్తే అభ్యేతి); సమాసమందు నిత్యము (ఉ. రాజాజ్ఞ. ఇల్లాలు); వాక్యమందైననో వివక్షాధీనము (దధి అత్ర, పెరుగు ఇక్కడ) సంహితముగా అర్ధమాత్రాకాల మాత్రవ్యవధానము, రెండక్షరములకు అర్ధమాత్రావ్యవధానము తప్పదు, తావన్మాత్ర వ్యవథానము సంహిత, అంతకన్న హెచ్చువ్యవథానము సంహితకాదు....... విసంధి సహ్యముగాను సుఖముగాను ఉన్నది అట్లే 'అతడు అప్పుడు అక్కడఉండెను' అనువాక్యమును సులువుగా నుచ్చరించిన సుఖముగానేయుండును" అని దానిసారము. అట్లే తమ గ్రంథములయందు విసంధిని పాటించిరి.

ఈకాలమున మదరాసునందును ఆంధ్రడేశమందు పలుతావులను గ్రామ్యాదేశ నిరసనోపన్యాసములు జరుగుచుండినవి. ఆసభలలో శ్రీ శాస్త్రులవారును అప్పారావుగారును కలసికొనుచుండెడివారు. పచ్చయప్ప కళాశాలాసౌధమున నొక సమావేశము జరిగినది. ఆవెంటనే శ్రీ గురుజాడ అప్పారావుగారు వేంకటరాయశాస్త్రులవారికి వ్రాసిన జాబు-

2nd June 1912,

Dear and respected friend,

I was very much gratified when you told me at the Madras conference that you went with