పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళాశాలలో ఆంధ్రులు ద్రావిడులు కర్ణాటకులు కేరళీయులు, హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులును సంస్కృతవిద్యార్థులుగా నుండిరి. శాస్త్రులవారు ఆంగ్లమున పాఠ్యములకు వివరించుచుండిరి. శాస్త్రులవారు బి.ఏ. పూర్తిచేసికోలేదుగాని ఆంగ్లమున మంచిపాండిత్యము నార్జించిరి.

శాస్త్రులవారికడ విద్యార్థులుగానుండి అనంతరము ప్రసిద్ధికి వచ్చినవారు-శ్రీ జగన్నాథపురి శంకరాచార్యస్వాములవారైన భారతీ కృష్ణతీర్థులు (పూర్వాశ్రమమున వేంకటరమణ సరస్వతియని ప్రసిద్ధులు), మైసూరులో దివానుగానుండిన రాజబంధువు శ్రీ లేటు కాంతరాజఅరస్ గారు, కీ.శే శ్రీ సత్యమూర్తిగారు, శ్రీయుత నాగేశ్వరరావు పంతులుగారు, మా పుదూరుద్రావిడసంఘమునకు చూడామణులు దివాన్ బహదూర్ సర్ అల్లాడి కృష్ణస్వామిగారు, మద్రాసు విశ్వవిద్యాలయ చరిత్రాచార్యులు శ్రీ కే.ఏ. నీలకంఠశాస్త్రులవారు, ప్రస్తుతము భరత్‌పూరు దివానుగారైన శ్రీ ఏ.వి..రామనాధన్‌గారు, ఇంక ననేకులు.

కళాశాలలో నున్నంతకాలము ఆంగ్లేయులు ప్రొఫెసర్లేమి, ఇతరాథ్యాపకులేమి శాస్త్రులవారియందు గౌరవప్రవత్తులతో మెలగిరి. శాస్త్రులవారు తమవిధిని ఆసడ్డచేసి యెఱుగరు. ప్రిన్సిపాలు మొదలగునధికారులకు ఒగ్గితగ్గి తిరుగలేదు.

ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి