పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కతంబున పరమమిత్రులైరి. మదరాసులో వీరిరువురును ప్రతిసాయంకాలమును కలిసికొనుచుండెడివారు; సకల విద్యావిషయములందును సంప్రతించు కొనుచుండెడివారు. వేంకటరాయశాస్త్రులవారిని తమ పుదూరు ద్రావిడసంఘమునకు చెందినవారనియేగాక (శేషగిరిశాస్త్రులవారును పుదూరు ద్రావిడులు) ముఖ్యముగా వారిపాండిత్యముపై నిభిమానముంచి వారి గ్రంథములను పాఠ్యములగునట్లు ప్రయత్నించుచుండు వారు. నాగానందనాటకమును పాఠ్యముగా వీరిప్రోత్సాహము చేతనే పెట్టినారు. "శ్రీమంతులు అష్టాదశ భాషాధురంధరులునగు ప్రొఫెసరు శేషగిరిశాస్త్రులవారు నన్ను ఎఱుకచేసికొని నాకు మిత్త్రధేయమై తాముగా యత్నించియు, శ్రీ మిల్లరుదొరగారిని హెచ్చరించియు యూనివర్సిటీ పరీక్షాధికారమును నాకు ఇప్పించినారు."*

వెనుక శాస్త్రులవా రొకసంవత్సరము తమిళమునకు పరీక్షకులైరిగాని తమిళముపై నభిమానములేనందున దానిని మానుకొనిరి. తర్వాత బహుకాలము తర్కవేదాంతమున స్తత్వ శాస్త్రాదికములకు పరీక్షకులుగానుండిరి. కళాశాలలో కొంతకాలము పైశాస్త్రములను బోధించుచునుండిరి.

ఈకాలముననే (1900 సం) శాస్త్రులవారితండ్రిగారు వేంకటరమణశాస్త్రులవారు నిర్యాణముంజెందిరి. శాస్త్రులవారికి తండ్రిగారిమరణము హృదయమున ఆరనివ్రణముంగావించినది.


  • శ్రీ వేంకటగిరిరాజాగారికి శాస్త్రులవారు వ్రాసినజాబునుండి.