పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14-ప్రకరణము

పితృ మిత్ర వియోగము

శాస్త్రులవారికి చిరకాలమువరకు పరీక్షాధికారము రాలేదు. ఎవరెవరో అడ్డుతగులుచుండిరి. తుదకు 1900 సం. మున నాంధ్రమునకు పరీక్షకులైరి పూ రామకృష్ణయ్యగారు ఒకజాబులో తమసంతసము నిట్లు వెలిబుచ్చిరి.

తమ యెగ్జామినరుషిప్పు విషయమై యిచ్చట మే మొక పబిలికుమీటింగు చేయవలయుననియెంచి కొంతపనియుచేసి యుంటిమిగాని గజెటులో అదిప్రకటింపబడు నంతదనుక యేమి చేయుటకును వలనుపడదని తొందరనినందున నిలిపించినారము. అది యెప్పుడుబయటపడును? యీ మహాయుద్ధములో మిమ్ము నాంధ్రమునకే యేర్పాటుచేయుట కొంత సుగుణమనియు విమతులకు శృంగభంగమనియు తలచెద. ఇచట మాకందరికి తమకు యత్జామినరగుట బ్రహ్మానందముగా నునది.........చిత్తగించవలెను.

ఇట్లు విధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య

కవిపండితసభ కగ్రాసనాధిపత్యము వహించినవారు 'అష్టాదశ భాషాలక్ష్యలక్షణాభిజ్ఞ సార్వభౌములు ప్రెసిడెన్సీ కాలేజి సంస్కృత మహోపాధ్యాయులు, ప్రాక్తనపైలాలజీ ప్రథమ ప్రవర్తకులు' వేంకటరాయశాస్త్రులవారికి వారి పాండిత్యము