పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రపండితులారా, ఆంధ్ర భాషాభిమానులారా!..........మేము మీకు నివేదించిన యీవిషయములనెల్ల మీరు చక్కగవిచారించి పూర్వోక్తప్రకారము సంఘమును సంస్కరింతురుగాత.

ఇట్లు పండితజనవిధేయులు.
శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
కోవూరు సుబ్బరామయ్య
గుండ్లపూడి సుబ్బయ్య
సి. దొరస్వామయ్య.

ఈవిధముగా నాంధ్రకవిపండితసంఘము తుదముట్టెను. శాస్త్రూవారు మరల తమ బొందిలో నూపిరియుండగా నీ సంఘములేవదని వచించిరి. ఆవెనుక శాస్త్రులవారు వీరిలో రఘనాథపురం వెంకటసుబ్బయ్యరుగారును మఱియొకరును ప్రకటించిన కాళహస్తిమాహాత్మ్య ముద్రణమును విమర్శించి దానిని శారదా కాంచిక తృతీయకింకిణియని పేర్కొనిరి. 1900 సం. పాత్రోచితభాష ఆవశ్యకమని సంస్కృతాంధ్ర గ్రంథములనుండి ఆథారములు చూపి 'గ్రామ్యభాషా ప్రయోగనిబంధనము'ను రచించి శారదాకాంచిక నాలుగవకింకిణిగా ప్రకటించిరి.

తమ పాండిత్యాతిశయములను సమకాలికులు గ్రహింప లేదనియో లేక నిరంతరము తమ్ము దూషించువారికి దెబ్బగానో ఏకారణముచేతనో శాస్త్రులవారు ప్రతాపరుద్రీయములో నటిచే నీపద్యముం జెప్పించిరి.