పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాంధ్రకవిపండితసంఘ మొక్కసారి నేలపడబోవుచున్నదా యనునట్లు సభ్యులయుల్లములు జల్లుమనునట్లు ప్రసంగించిరి. అగ్రాసనాధిపతిగారు సభ్యులవంకజూచిరి. సభ్యు లాచార్యులవంకజూచిరి. ఆచార్యులవా రాకాశమువంకంజూచిరి....' అని రాజహంస కూజితము. 'శాస్త్రులవారి వలన మనభాషకు ముప్పు తప్పినది, భాషకింకను మంచికాలము కొంతవఱకున్నది' అని దేవరాజపెరుమాళ్లయ్య లోనగు నాంధ్రపండితులు సంఘమందు మిత్రులతో వక్కాణించిరి.

శ్రీ శాస్త్రులవారి యుపన్యాసముగుఱించి, బ్ర.శ్రీ. కొక్కొండ వేంకటరత్నముపంతులవారు విళంబిపుష్యసంజీవనిలో నీవిధముగా నిందించి యున్నారు.

'బ్ర. వేదము వేంకటరాయశాస్త్రులవారును, బ్ర. పూండ్ల రామకృష్ణయ్యగారును ఝుంఝామారుతమువోలె మారుకొన్నందునన్, బ్ర.శ్రీ మచ్ఛతావధాని ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి కృతి విమర్శనొపసంఘ విషయమైనవాదమను నౌక యాకాలమున సంగభంగభయమను సముద్రమునన్ మునింగె. ఆనావ వెండియు లోనుండి వెలువవరించుట కొకసంవత్సరము పట్టునని తెలియవచ్చె. వేయేల? ఈయోలగముయొక్క ముఖ్యేద్దేశము చక్కగా నెఱవేఱమికిత్తఱి బ్ర. వేదము వేంకటరాయశస్త్రిగారును, బ్ర. పూండ్ల రామకృష్ణయ్యగారును నను నీయిరువురే కారణభూతులని యందఱుం దలంచిరి. మఱి వచించిరి. ఈయాంధ్రకవిపండితసంఘ మహాసభ భవిష్యద్వర్షమున నెల్లూరులో జరుగునట్లు నిష్కర్షింపబడియెను. ఇక నిది యక్కడ నెక్కరణింజరుగునో? ఎందుకుగాని యీయిరువురుం జతపడుదురేని కృతివిమర్శనోప సంఘప్రతిష్ఠాపనాశయమ ద్రాక్షాలత నిష్ఫలమేగాని సఫలము గానేరదు. చిలుకకు తనముద్దేగాని యెదుటిముద్దెఱుగదు నావినమే? ఒరులమాట యేటికి. ఆయిరువురలోనే యాంధ్రగ్రంథవిమర్శనాధి కారమునకు మేమేయర్హులముగాక యన్యులుగారని వారివారి యభిప్రాయముండబోలును. కాన వీరిని మానజాలమేలు.'