పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాదనిరి. అంతట కృష్ణమాచార్యులవారు తెనుగును ఏటగలిపి ఇంగిలీషులో లైన్‌బైలైన్ క్రిటిసిసమ్‌స్‌' అని వేంకటరాయశాస్త్రులవారి విమర్శలను దూలనాడిరి. వేంకటరాయశాస్త్రులవారు 'వరడ్‌బైవరడ్ అండ్ సిల్లబిల్‌బై సిల్లబిల్ క్రిటిసిసమ్‌స్, నాట్‌లైన్ బై లైన్‌' అని బదులునుడివిరి.

తర్వాత పూండ్ల రామకృష్ణయ్యగారు, 'నాటకములందు నీచపాత్రములకు గ్రామ్యముంచతగునా తగదా?' అనువిషయము చర్చింపదగినది' అని నుడివిరి. వేంకటరాయశాస్త్రులవా రామోదించిరి. తత్పూర్వము పత్రికలలో గ్రామ్యమును నిషేధించుచుండిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారును, అట్లే గ్రామ్యనిషేధవాదులైన కృష్ణమాచార్యులవారును.......ఏవమాదులు ఆవిషయము చర్చకు రాగూడదని యాక్షేపించిరి. 'ఇది విద్యావిషయముగదా ఏలరాగూడదని' వేంకటరాయశాస్త్రులవా రడిగిరి. అంతట కృష్ణమాచార్యులవారు, వేంకటరాయశాస్త్రులవారిని, 'మీతాత్పర్యము కొన్నిపద్యములు మాత్రము లక్షణభాషలోవ్రాసి కడమగ్రంథమెల్ల గ్రామ్యముగావ్రాసిన పనికివచ్చుననియా?' అని యడిగిరి. 'పాతివ్రత్యభంగమునకు ఎన్నిమారులు కక్కుర్తిపడవలయునని ధర్మశాస్త్రము?' అని శాస్త్రులవా రడిగిరి, ఎల్ల వారును ఊరకుండిరి. శాస్త్రులవారు మఱల 'పుటకెన్నిపంక్తులు గ్రామ్యముండవచ్చునని మీయభిప్రాయము? పండ్రెండా పదమూడా?' అనియడిగిరి. అందులకును ఎవ్వరుంబలుకకుండిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఈసభవారి సిద్ధాంతము ప్రకారము తాము నడుచుకొందురా?' యని శాస్త్రులవారినడిగిరి. ఈ ప్రశ్నలో ఎంత కుట్రకలదో యాలోచింపుడు. ఈ ప్రశ్న యడుగవలసిన ప్రసక్తియేమి" ఇతరులు తమతమ యుద్దేశ్యములందెలిపినపుడెల్ల వారిని 'ఈ విషయమున సభవారి సిద్ధాంతముప్రకారము మీరు నడచుకొందురా?' అని అడిగినారా? వేంకటరాయశాస్త్రిగారిని మాత్రము ఈప్రశ్నయడుగనేల? శాస్త్రిగారు అట్లే నడచుకొనియెదనని చెప్పినయెడల, వెంటనే తొలుత ఆచర్చగూడదన్నవారెల్ల ఇపుడు కూడుననియొప్పి పిమ్మట వోట్లబాహుళ్యముచే